Begin typing your search above and press return to search.

లోకేష్ పై రెచ్చిపోయిన కొడాలి నాని

By:  Tupaki Desk   |   21 Oct 2022 9:52 AM GMT
లోకేష్ పై రెచ్చిపోయిన కొడాలి నాని
X
టీడీపీ నేత చంద్రబాబు, నారా లోకేష్‌పై మాజీ మంత్రి కొడాలి నాని సీరియస్‌ అయ్యారు. పనికిమాలిన పప్పు .. లోకేష్‌.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురించి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనికిమాలిన 420 మీడియా కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు.

కొడాలి నాని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేష్‌ను పిచ్చి నా.. కు అని ప్రజలు అనుకుంటున్నారు. లోకేష్‌కు జయంతికి, వర్థంతికి తేడా తెలియదు. సీఎం వైఎస్‌ జగన్‌ పులి కాబట్టే.. మంగళగిరిలో నువ్వు ఆహారం అయ్యావు. పచ్చి అబద్ధాలు మాట్లాడటం పప్పు లోకేష్‌కు పరిపాటిగా మారింది. అని వ్యాఖ్యానించారు.

ఇసుక మీద ఏడాదికి రూ.750 కోట్లు సీఎం జగన్‌.. ప్రభుత్వానికి సమకూరుస్తున్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేయడమే సీఎం జగన్‌ ముఖ్య లక్ష్యం. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే జగన్‌ లక్ష్యం. సీఎం జగన్‌ మంత్రి వర్గంలో బీసీలకు పెద్దపీట వేశారు. మూడు రాజధానుల మీద చర్చ జరగవద్దనే డైవర్ట్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. కృత్రిమ మేధావులను సృష్టించి తిట్టిస్తున్నారు. బెల్టు షాపులు రద్దు చేసిన ఘటన సీఎం జగన్‌ది.

చంద్రబాబు హయంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని దోచేశారు. రాష్ట్రాన్ని దోచుకున్నారు. రాష్ట్రంలో పనికిరాని పార్టీలు టీడీపీకి మద్దతు తెలుపుతున్నాయి. డిస్టిలరీలకు లైసెన్స్‌లు ఇచ్చిందే చంద్రబాబు. ప్రజల దృష్టి మరల్చడానికే ఎల్లో మీడియాతో దుష్ప్రచారం చేయిస్తున్నారు. మద్యాన్ని ఏరులై పారించిన వ్యక్తి చంద్రబాబు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్‌ చిత్తుగా ఓడిపోతారు. ఎంగిలి మెతుకులకు ఆశపడ్డ వ్యక్తి చంద్రబాబు. బాబు చేసిన వెధవ పనుల వల్లే 420 అంటున్నారు.

అమరావతి పాదయాత్రను స్థానికులు అడ్డుకుంటే అది దారుణామా?. ప్రజాస్వామం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. ముద్రగడ పద్మనాభంను ఎలా అవమానించారో రాష్ట్రం మొత్తం చూశారు. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన బాబు..

ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. మ‌రి సీఎం జ‌గ‌న్ బూతులు మాట్లాడొద్దు.. అని చెప్పి 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క‌ముందే.. మంత్రినాని ఇలా వ్యాఖ్య‌లు చేయ‌డంపై సీఎం జ‌గ‌న్ ఏమంటారో.. ఏం చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.