Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్ను వెత్తుకోవాల్సిందేనా?

By:  Tupaki Desk   |   13 Oct 2022 4:50 AM GMT
గేమ్ ఛేంజర్ను వెత్తుకోవాల్సిందేనా?
X
ఇంతకాలం వస్తాడు వస్తాడని ఎదురుచూసిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లేసులో కొత్త గేమ్ ఛేంజర్ ను వెతుక్కోవాల్సిన పనిపడింది. మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో తాను అభ్యర్ధి తరపున ప్రచారం చేసి పార్టీని గెలిపిస్తానని ఒకపుడు వెంకటరెడ్డి చెప్పారు. దాంతో పార్టీ నేతలు ఎంపీని గేమ్ ఛేంజర్ అని చెప్పుకున్నారు. ఎంపీ సామర్థ్యం మీద బాగా నమ్మకం పెట్టుకుని ఇంతకాలం ఎదురుచూస్తున్నారు.

అయితే ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉప ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొనడం లేదని తేల్చి చెప్పేశారు. కొందరు సీనియర్ నేతలతో పాటు చివరకు అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి కూడా ప్రచారంలో పాల్గొంటానని మాటిచ్చారు.

ఇంతకాలం అభ్యర్ధి ఇదే మాటను గట్టిగా చెప్పుకున్నారు. తీరా తాను ప్రచారం చేసేదిలేదని చెప్పటంతో ఏమి మాట్లాడాలో అర్ధం కావటంలేదు. బీజేపీ అభ్యర్ధిగా స్వయాన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పోటీచేస్తుండటంతో ఎంపీకి ఏమిచేయాలో దిక్కుతోచలేదు.

చివరకు ఎవరేమనుకున్నా పర్వాలేదు తమ్ముడి గెలుపే ముఖ్యమనుకున్నారు. అందుకనే ఇపుడు అందరికీ హ్యాండిచ్చారు. మరిపుడు పార్టీలో గేమ్ ఛేంజర్ ఎవరు అన్న ప్రశ్న మొదలైంది. ఎంపీ స్ధాయిలో పనిచేసి గెలిపించేంత సీన్ ఎవరికీ లేదన్నది వాస్తవం.

అయితే నేతలంతా కలిసికట్టుగా కమిట్మెంట్ తో పనిచేస్తే ఏమన్నా ఉపయోగం ఉండచ్చనేది ఒకఆశ. ఎందుకంటే నేతలతో సంబంధంలేకుండా కాంగ్రెస్ పార్టీకి చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న నియోజకవర్గం. ఇక్కడినుండి పాల్వాయి గోవర్ధనరెడ్డి ఏకంగా ఆరుసార్లు గెలిచారు.

ఆయన కూతురే ఇపుడు పార్టీ అభ్యర్ధి అయినా తండ్రంత స్ట్రాంగ్ కాదు కూతురు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే స్రవంతికి టికెట్ ఇస్తే గెలిపించుకుని వస్తానని ఎంపీ అధిష్టానంతో పోరి మరీ టికెట్ ఇప్పించుకున్నారు. ప్రత్యేకించి గేమ్ ఛేంజర్ అని ఎవరు లేరుకాబట్టి అత్యంత ప్రతిష్టగా తీసుకుని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే నడుం బిగించాలి. అయినా ఫలితం ఉంటుందా ?



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.