Begin typing your search above and press return to search.
మళ్లీ పంచాయితీ.. దొరికాడని రేవంత్ పై పడ్డ కోమటిరెడ్డి
By: Tupaki Desk | 9 Feb 2023 10:00 PM GMTతెలంగాణ కాంగ్రెస్ ను ఎవరో ముంచాల్సిన పనిలేదని.. వాళ్లకు వాళ్లే ముంచుకుంటారన్న ఒక అపవాదు రాజకీయవర్గాల్లో ఉంది.దాన్ని అక్షరాల నిజం చేస్తున్నారు కాంగ్రెస్ వాదులు. అవును.. కాంగ్రెస్ లోనే ఉంటూ కాంగ్రెస్ నే దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నా ఆ నేతలపై చర్యలు ఉండవని నేతలు చెప్పుకుంటారు.. మునుగోడు ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకంగా బీజేపీలో చేరిన తన తమ్ముడిని గెలిపించేందుకు ప్రయత్నించారని కొన్ని ఆడియోలు వైరల్ అయ్యాయి. వాటిపై ఏఐసీసీ నోటీసులు ఇచ్చినా కూడా చర్యలు మాత్రం తీసుకోలేదు.
తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తూ కాంగ్రెస్ ను పునరుత్తేజం చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ ను పేల్చేయాలంటూ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై అధికార బీఆర్ఎస్ సహా ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
తాజాగా రేవంత్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. రేవంత్ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రగతి భవన్ ను ప్రజల ఉపయోగం కోసం కట్టించారని అన్నారు. మరోవైపు రేవంత్ వ్యాఖ్యలపై అధికార బీఆర్ఎస్ నేతలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేసులు సైతం పెట్టారు.
సొంత కాంగ్రెస్ పార్టీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై అదే కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి తప్పుపట్టడమే వింత అని చెబుతున్నారు. ఎక్కడైనా పార్టీ అధినేతను ఎవరైనా వెనకేసుకొస్తారు. కానీ కోమటిరెడ్డి మాత్రం తప్పు పట్టడం విస్తుగొలుపుతోంది.
తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ పంచాయితీ మొదలైందనే చెప్పాలి. మొన్న కాంగ్రెస్ ఇన్ చార్జి వచ్చినప్పడు కలిసిపోయిన రేవంత్ రెడ్డి-కోమటిరెడ్డి తాజా వ్యాఖ్యలతో మరోసారి విడిపోయారని చెప్పొచ్చు. ఈ అసమ్మతి ఎటు దారితీస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.