Begin typing your search above and press return to search.
కేటీఆర్ కు భారీ నాటు కౌంటర్ వేసిన కొండా మురళి
By: Tupaki Desk | 19 Jun 2023 5:42 PM ISTకొన్ని అంశాల్ని పట్టించుకోనట్లుగా ఉండటం చాలా ముఖ్యం. ఎవరి మీద వ్యాఖ్యలు చేస్తే.. ఎవరి మీద విమర్శలు చేస్తే మైలేజీ వస్తుందో మంత్రి కేటీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదు. ఎందుకుంటే.. ఉద్యమ కాలంలో కనిపించని కేటీఆర్.. అనూహ్యంగా ఎంట్రీ ఇవ్వటమే కాదు.. అప్పటికే పార్టీలో బలంగా ఉన్న హరీశ్ ఇట్టే దాటేయటమే కాదు..పార్టీలో నెంబరు 2 స్థానం తనదే అన్న విషయాన్ని దాదాపు పుష్కరం కిత్రమే అర్థమయ్యేలా చేసిన తెలివి కేటీఆర్ ది.
తన స్థాయికి మించిన నేతల తో తలపడే కేటీఆర్.. తన మాటల చాతుర్యంతో అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే.. అలాంటి కేటీఆర్ తన గతాన్ని మర్చిపోయినట్లున్నారు. ఎవరినైతే టచ్ చేయకూడదో వారిని టచ్ చేస్తే తనకు జరిగే నష్టాన్ని ఆయన గుర్తించే విషయాన్ని మర్చిపోయినట్టున్నారు. ఇటీవల వరంగల్ పర్యటన సందర్భంగా కొండా మురళీ మీదా.. కొండా దంపతుల మీద కాస్తంత ఘాటు విమర్శలు చేశారు. మంత్రి కేటీఆర్ నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యల కోసమే ఎదురుచూస్తున్నట్లుగా ఉన్న కొండా మురళీ చెలరేగిపోయారు.
దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే రీతి లో మంత్రి కేటీఆర్ కు ఆయన పంచ్ లు వేశారు. అయితే..ఆయన కౌంటర్ పరమ వీర నాటుగా ఉండటం గమనార్హం. అయితే.. తనకు అలవాటైన భాష లోనే మాట్లాడిన కొండా మురళీ మాటల్ని చూసినప్పుడు.. కేటీఆర్ ఆయన్నురాంగ్ గా టచ్ చేశారన్న భావన పార్టీ లోనూ వ్యక్తం కావటం గమనార్హం.
ఇంతకూ కొండా మురళీ ఏమన్నారన్నది చూస్తే.. "నేను మొగోన్ని.. మీసాలు మెలేస్తా. నన్ను రౌడీ అంటున్నావు. మీ పార్టీ నాకెలా ఎమ్మెల్సీ ఇచ్చింది? శ్రీక్రిష్ణదేవరాయులు వంశం లో పుట్టినోళ్లం. మీసాలు మెలేస్తం. నువ్వు ఆడది కాదాయే.. మొగోడివి కాదాయో. మీసాలు లేక ఎవరో తెలియకపాయె. మీసాలుంటే మెలేస్తే బుద్ధివంతుడివి.. ధైర్యవంతుడివి అనుకునేవాళ్లం" అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
తన పేరు పలికే ధైర్యం కేసీఆర్.. కేటీఆర్ లకు లేదన్న ఆయన.. 2014లో బస్వరాజ్ సారయ్యను ఓడించేందుకే వరంగల్ తూర్పులో టీఆర్ఎస్ తరఫున కొండా సురేఖ ను కేసీఆర్ పోటీ చేయించారన్నారు. కేటీఆర్ పైసలు తీసుకొని పని చేస్తారని.. తాను ఫ్రీగా పని చేస్తానన్నారు. అజంజాహీ మిల్లుస్థలం విషయంలో తనకు కేటీఆర్ కు లొల్లి మొదలైందన్న కొండా మురళీ.. కేసీఆర్.. కేటీఆర్ లు పరిపాలన మీద కాకుండా 30శాతం కమీషన్ పై శ్రద్ధ పెట్టారన్నారు.
వరంగల్ సెంట్రల్ జైలును కుదవ పెట్టిన ఘనత కేసీఆర్ సర్కారుదన్న ఆయన.. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ నియంత పాలన కు చరమగీతం పాడతారన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 10 మంది కార్పొరేటర్లు తనతో టచ్ లో ఉన్నారన్న కొండా మురళీ.. ఎన్నికల తర్వాత కేటీఆర్ కుటుంబం విదేశాల కు పారిపోతుందన్న వ్యాఖ్యలు చేయటం గమనార్హం.