Begin typing your search above and press return to search.
బిర్లా ఫ్యామిలీని గెంటేసిన అమెరికా రెస్టారెంట్
By: Tupaki Desk | 28 Oct 2020 1:30 AM GMTఅమెరికాలో భారతీయుల పట్ల మరోసారి జాతి వివక్ష బయటపడింది. సామాన్యులకే కాదు.. భారత్ లోనే సంపన్న కుటుంబానికి కూడా ఈ అవమానం తప్పలేదు.
తాజాగా అమెరికాలో భారత్ లో సంపన్న కుటుంబాల్లో ఒకటైన ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారం మంగళం బిర్లా కుటుంబానికి తీవ్ర అవమానం ఎదురైంది. బిర్లా కూతురు అనన్య బిర్లాకు, కుటుంబానికి అమెరికాలోని ఓ రెస్టారెంట్ లో చేదు అనుభవం ఎదురైంది.
ఈ సంఘటనను అనన్య బిర్లా తాజాగా సోషల్ మీడియాలో పంచుకుంది. ట్విట్టర్ లో సదురు రెస్టారెంట్ యజమానుల జాతివివక్ష అంశాన్ని లేవనెత్తి ఆవేదన వ్యక్తం చేసింది.
కాలిఫోర్నియాలోని ఇటాలియన్-అమెరికన్ రెస్టారెంట్ నుంచి తమను గెంటివేసినంత పనిచేశారని మండిపడ్డారు. తనను, తన కుటుంబాన్ని ఆ రెస్టారెంట్ పరిసరాల నుంచి గెంటివేసినంత పనిచేసి దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నారు. స్కోపా రెస్టారెంట్ నిర్వాహకులు తనను తన కుటుంబాన్ని బయటకు గెంటేశారని.. జాతి వివక్షను ప్రదర్శించారని అనన్య బిర్లా తెలిపారు.
ఈ రెస్టారెంట్ లో భోజనం చేయడానికి మూడు గంటలు ఎదురుచూశామని.. వెయిటర్లు తమ అమ్మతో దురుసుగా ప్రవర్తించి జాతి వివక్ష పూరిత వ్యాఖ్యలు చేశారని ట్వీట్ లో వాపోయారు.
దేశంలోనే బిలియనీర్ అయిన ఆదిత్య బిర్లా -మెంటల్ హెల్త్ యాక్టివిస్ట్ నీర్జా బిర్లా కూతురు నీర్జా బిర్లా కూతురు అనన్య బిర్లా. ఈమె గాయని, ఆర్టిస్టుగా సొంత గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా కాలిఫోర్నియా హోటల్ లో ఈమెకు చేదు అనుభవం ఎదురైంది. అమెరికా రెస్టారెంట్ పై సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.