Begin typing your search above and press return to search.
కన్నడ నాట మళ్ళీ కుమార రాజ్యం....?
By: Tupaki Desk | 28 April 2023 2:49 PM ISTపెట్టి పుట్టారు కుమార స్వామి అని అనుకోవాలేమో. లేకపోతే ఆయన పార్టీకి మొత్తం కర్నాటక అసెంబ్లీ సీట్లలో ఎనిమిదవ వంతు కూడా రావు. కానీ ఆయన మాత్రం ముఖ్యమంత్రిగా సౌత్ లో రెండవ అతి పెద్ద స్టేట్ ని ఏలుతూంటారు. ఇప్పటికి మూడు సార్లు అలా సీఎం పోస్టుని చేపట్టి ఏ రాజకీయ నేతకు దక్కని లక్ ని సొంతం చేసుకున్న కుమార స్వామిని మరోసారి కన్నడ సీఎం సీటు రారమ్మని పిలుస్తోందని అంటున్నారు.
నెల రోజుల క్రితం కర్నాటకలో నిర్వహించిన సర్వేలు చూస్తే కాంగ్రెస్ కి పూర్తి ఆధిక్యత కనిపించింది. దానికి కారణం బీజేపీ ఇంకా అభ్యర్థుల విషయంలో సర్దుకోకపోవడంతో పాటు అసంతృప్తులు అలకలు ఇలా అనేక కారణాల వల్ల కాంగ్రెస్ కంటే వెనకబడింది.
అయితే అన్నీ చూసుకుని మరీ బీజేపీ బరిలోకి దూకింది. అంతే కాదు కొత్త ముఖాలను చాలా చోట్ల పెట్టి ఢీ కొడుతోంది. దీంతో కన్నడనాట పొలిటికల్ సీన్ మొత్తం మారిపోయింది. దాంతో పాటు జనం మూడ్ కూడా చేంజ్ అయింది. అది ఎలా ఉంది అంటే అన్ని నియోజకవర్గాల లో బీజేపీ కాంగ్రెస్ ఢీ అంటే ఢీ కొడుతున్నాయి.
దాంతో ఇపుడు తాజాగా వస్తున్న సర్వేలను చూస్తే ఏ పార్టీకి మెజారిటీ పూర్తి స్థాయిలో రాదు అని లెక్క తేలుతోంది. ఒక దశలో 130 సీట్ల దాకా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పిన సర్వేలు ఇపుడు వంద సీట్ల లోపే గెలుస్తుంది అని చెబుతున్నాయి. అలాగే బీజేపీ కూడా వందకు తగ్గకుండా సీట్లలో ప్రభావం చూపిస్తోంది అని అంటున్నారు.
దీంతో చూసుకుంటే జేడీఎస్ కి మళ్ళీ డిమాండ్ వచ్చినట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు. కర్ణాటకలో మొత్తం అసెంబ్లీ సీట్లు 224 ఉన్నాయి. మెజారిటీ రావాలంటే 113 సీట్లు ఏ రాజకీయ పార్టీకైనా అవసరం. అయితే అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఆ నంబర్ కి చేరువ అవడం కష్టంగానే మారుతోంది అంటున్నారు.
అదే కనుక జరిగితే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అతి పెద్ద పార్టీగా మాత్రమే అవతరించగలవు. అపుడు పాతిక ముప్పయి సీట్లు సంపాదించే జేడీఎస్ నే వారికి దిక్కు అవుతుంది. కుమారస్వామి ఏ పార్టీతో పొత్తుకైనా రెడీ. ఎందుకంటే ఆయనకు సీఎం పదవి కావాలి. పైగా ఆయన ఈ చాన్స్ తనకు చివరిది అని చెబుతున్నారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని అంటున్నారు.
దాంతో కుమారస్వామి సీఎం అవడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి కన్నడ నాట బీజేపీ కాంగ్రెస్ ఎంతగా తొడలు కొట్టి వాచబెట్టుకున్నా చివరికి కూల్ గా సీఎం సీటు ఎక్కేది మాత్రం కుమార స్వామి అని సర్వేలు చెబుతున్న సత్యం.