Begin typing your search above and press return to search.
లక్ష్మీపార్వతికి అక్రమ సంబంధం అంటగట్టారు.. ఎన్టీఆర్ కు కూడా తెలుసు!
By: Tupaki Desk | 28 May 2023 2:09 PM GMTదివంగత ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమాన్ని వైసీపీ కూడా నిర్వహించింది. ప్రభుత్వం అధికారికంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయనను శాలువా కప్పి.. ఎన్టీఆర్ కళా రత్న బిరుదు, ఒక మెమెంటో ఇచ్చి సత్కరించారు. అనంతరం.. పోసాని నోటి నుంచి వచ్చిన కామెంట్లు నివ్వెరపోయేలా చేశాయి. లక్ష్మీ పార్వతి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందు కు చాలా ప్రయత్నించారని, కానీ ఎన్టీఆర్ మాత్రం అవేవి పట్టించుకోలేదని అన్నారు.
"ఎన్టీఆర్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఎన్టీఆర్ జీవితం లో మీకు తెలియని కొన్ని నిజాలు చెబుతా. ఎన్టీఆర్ జీవితం లోకి లక్ష్మీ పార్వతిని ఆయనే తీసుకొచ్చుకున్నాడు. ఆమెకు అప్పటికే చాలా ఆస్తులు ఉన్నాయి. ఆమె ఓ లెక్చరర్. సంస్కృతం బాగా వచ్చు. గొప్ప మేధావి. అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ పక్కన ఉంటే తన ఆటలు సాగవని ఒకరు భావించారు" అని అన్నారు.
"లక్ష్మీ పార్వతి స్నేహితురాలి కొడుకుతో ఆమెకు అక్రమ సంబంధం ఉందని పుకార్లు పుట్టించారు. ఇదే విషయం ఎన్టీఆర్ వరకు వెళ్లింది. ఓ రోజు ఎన్టీఆర్.. లక్ష్మీ పార్వతి ని, ఆ అబ్బాయి ని ఇంట్లోకి పిలిపించుకున్నాడు. తిరుపతి లడ్డు ఆ అబ్బాయి చేతిలో పెట్టి.. 'దీని పై ప్రమాణం చేసి చెప్పు.. లక్ష్మీ పార్వతి కి నీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి?' అని అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి గట్టిగా ఏడుస్తూ..'లక్ష్మీ పార్వతి నాకు తల్లి లాంటిది సర్. నేను ఏ తప్పు చేయలేదు' అని చెప్పాడు.
అప్పుడు వెంటనే ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులందరిని పిలిచి.. 'నా ఆరోగ్యం సహకరించడం లేదు. తోడు కోసం ఆ అమ్మాయి(లక్ష్మీ పార్వతి)ని పెళ్లి చేసుకుంటాను' అని చెప్పాడు. అప్పుడు ఇంట్లో వాళ్లు ఎవరూ ఒప్పకోలేదు. కారణం ఎన్టీఆర్ ఎక్కడ తన ఆస్తులన్నీ ఆమెకు ఇస్తారోననే భయం. కానీ లక్ష్మీ పార్వతి ఎప్పుడూ ఆస్తుల గురించి ఎన్టీఆర్ దగ్గర ప్రస్తావించలేదు.
ఓ గొప్ప వ్యక్తికి తోడుగా ఉంటున్నానని సంతోష పడింది. కొందరు చేసిన పనుల వల్ల ఎన్టీఆర్‌కు మూడు సార్లు గుండె పోటు వచ్చింది. ఆ సమయంలో చిన్న పిల్లాడిలా అతన్ని చూసుకుంది లక్ష్మీ పార్వతి గారే. ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. అని పోసాని వివరించారు.