Begin typing your search above and press return to search.

పవన్ తో పార్టీ పెట్టించింది ఎవరో చెప్పేసిన లక్ష్మీపార్వతి

By:  Tupaki Desk   |   4 March 2023 8:56 AM GMT
పవన్ తో పార్టీ పెట్టించింది ఎవరో చెప్పేసిన లక్ష్మీపార్వతి
X
నోటికి వచ్చినట్లుగామాట్లాడే నేతల్లో వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి ఒకరు. తనకున్న విశ్వసనీయత ఎంతన్న విషయాన్ని పట్టించుకోకుండా.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతూ.. చివరకు తన భర్త స్వర్గీయ ఎన్టీఆర్ పేరును వైద్య వర్సిటీకి జగన్ సర్కారు తీసేసినా కూడా రియాక్టు కానీ ఆమె.. తరచూ చంద్రబాబు, పవన్ కల్యాణ్, నందమూరి కుటుంబం మీద అదే పనిగా వ్యాఖ్యలు చేసే ఆమె.. తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వూలో మరోసారి తన నోటికి పని చెప్పారు. ఎప్పటిలానే సంచలన వ్యాఖ్యలు చేసేందుకు వెనుకాడలేదు. తాను చెప్పిన మాటలకు ఎలాంటి ఆధారాల్ని చూపించకుండానే బండలు వేసే లక్ష్మీ పార్వతి మరోసారి ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశారు.

జనసేన పార్టీని ఎవరు పెట్టించారో తెలుసా? అంటూ ప్రశ్నించిన లక్ష్మీ పార్వతి.. ఆ పనిని చేసింది చంద్రబాబు నాయుడిగా ఆమె కొత్త ముచ్చటను చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబును పవన్ కలిశారని.. ఆ తర్వాతే ఆయన జనసేన పార్టీని ప్రకటించారన్నారు. 'పవన్ కోసం చంద్రబాబు స్టూడియోకు వెళ్లారు. అవసరం ఉంటే బాబు ఏమైనా చేస్తారు. ఇప్పటికి జనసేనాని పార్టీని బలోపేతం చేయటం లేదు. ఎప్పుడో ఒకసారి రాష్ట్రానికి వచ్చి వెళుతుండాడు. టీడీపీ.. జనసేనలకు ఒప్పందం ఉంది' అని వ్యాఖ్యానించారు.

వారాహిని సినిమా షూటింగ్ ల కోసం ఇచ్చారని.. ఆ అద్భుత విషయం తనకు కొంతమంది ద్వారా తెలిసిందన్న ఆమె.. బాలయ్య నిర్వహించే టాక్ షో అన్ స్టాపబుల్ కు తనను ఆహ్వానిస్తే తానువెళతానని.. అందులో చంద్రబాబు కుట్ర ఎపిసోడ్ ను చెబుతానని చెప్పారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటుకు సంబంధించిన విషయాల్ని తాను ప్రస్తావిస్తానని చెప్పారు. అయితే.. ఆ షోకు తనను పిలవరన్న విషయం తనకు తెలుసన్నారు.

తారకరత్న కుటుంబాన్ని తాను ఫోన్లో పరామర్శించారనని.. ఆ కుటుంబానికి బాలయ్య అన్నీ చూసుకున్నారని.. ఆయనచాలా మంది వ్యక్తి అని ప్రశంసించారు. టీడీపీలోకి ఎన్టీఆర్ ను ఆహ్వానించిన లోకేశ్ వ్యాఖ్యలపైనా స్పందించారు. నక్క సింహాన్ని పిలిచినట్లుగా ఉందన్న వ్యాఖ్య చేసిన లక్ష్మీపార్వతి.. ''అతనో అల్ప జంతువు. ఏ క్వాలిటీ లేని వ్యక్తి. లోకేశ్ పాదయాత్రలకు జనాలు లేక కర్ణాటక, తమిళనాడు నుంచి పిలిపించినట్లుగా పేర్కొన్నారు. అన్నీ తనకు తెలుసన్నట్లుగా మాట్లాడే లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశాలుగా మారాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.