Begin typing your search above and press return to search.

ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ కు విశాఖ బ్రాండ్ ఇమేజ్ కు లింకేంటి?

By:  Tupaki Desk   |   16 Jun 2023 8:00 PM GMT
ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ కు విశాఖ బ్రాండ్ ఇమేజ్ కు లింకేంటి?
X
సాదాసీదా వ్యక్తులు కాదు. ఏకంగా ఎంపీ కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేసి కిడ్నాప్ చేయటం.. దాన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించటం లాంటి ఉదంతాలతో విశాఖపట్నం పేరు మరోసారి మారు మోగిపోతోంది. ఏపీకి కాబోయే రాజధానిగా చెబుతున్న విశాఖలో జరిగిన ఈ కిడ్నాప్ ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే విశాఖలో.. ఇలాంటి పరిస్థితి రావటం ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

అదే సమయంలో ఈ ఉదంతం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ ఉదంతం పై విపక్ష నేత చంద్రబాబు స్పందించారు. హుధూద్ తుపానుకు సైతం చెదరని విశాఖపట్నం వైసీపీ సర్కారు చేస్తున్న చేష్టలతో విశాఖ నగరం తల్లడిల్లుతుందని విమర్శలు చేయటం తెలిసిందే.

ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మంత్రి గుడివాడ అమర్నాధ్ విశాఖలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విపక్ష నేత చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు.

చంద్రబాబు కళ్లతో చూస్తే.. అన్నీ తప్పులుగానే కనిపిస్తాయన్నారు. ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఉదంతాన్ని చూస్తే.. పోలీసులకు సమాచారం ఎప్పుడు అందింది? దానికి వారెలా స్పందించారు? లాంటి ప్రశ్నలు వేసుకుంటే పోలీసులు ఎలా స్పందించారో తెలుస్తుందన్నారు.

జరిగిన ఉదంతాన్ని ఒక ఘటనగా మాత్రమే చూడాలే తప్పించి.. దీన్లో ప్రభుత్వ.. పోలీసుల వైఫల్యం అనటం సరికాదన్నారు. పోలీసులు ఎవరికి కష్టం కలిగినా ఒకేలా స్పందిస్తారని.. ఎంపీ.. మంత్రి అన్న బేధం ఉండదన్నారు.

మొత్తంగా ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ఉదంతాన్ని విశాఖ బ్రాండ్ ఇమేజ్ కు లింకు పెట్టిన వైనాన్ని మంత్రి గుడివాడ తప్పు పడుతున్నారు. సాపేక్షంగా చూస్తే.. ఒక నేరస్తుడు తాను నేరం చేయాలని డిసైడ్ అయితే.. దాన్ని ఎవరు మాత్రం ఆపగలుగుతారు? అదే ఏదైనా సంస్థ భారీ ఎత్తున ప్లాన్ చేస్తే.. నిఘా వర్గాలు అలెర్టుగా ఉంటే అడ్డుకునే వీలుంటుంది కానీ.. వ్యక్తిగతంగా చేసే నేరాల్ని అడ్డుకోవటం సాధ్యమయ్యే పని కాదని మాత్రం చెప్పకతప్పుద.