Begin typing your search above and press return to search.
జగన్‌కు లోకేష్ డెడ్ లైన్ !
By: Tupaki Desk | 11 Nov 2021 3:30 AM GMTఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎయి డెడ్ విద్యాసంస్థల విలీనంపై జారీ చేసిన జీవో 42ను వారం రోజుల్లోగా వెనక్కి తీసుకోవాలంటూ.. డెడ్‌లైన్ విధించారు. వారం రోజుల్లో జీవో 42ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురంలో విద్యార్థులపై లాఠీ చార్జి నేపథ్యంలో బుధవారం అక్కడకు వెళ్లి పరిశీలించి.. విద్యార్థుల్లో ధైర్యం నింపిన.. లోకేష్.. ఆర్కే ఫంక్షన్ హాల్లో.. విద్యార్థులతో ముఖాముఖి తర్వాత ఎస్ఎస్బీఎన్ కళాశాల వద్దకు వెళ్లారు.
అయితే.. లోకేశ్ వస్తున్న విషయం తెలుసుకున్న యాజమాన్యం కళాశాలకు సెలవు ప్రకటించి తాళాలు వేసింది. కళాశాల వద్దే విద్యార్థులతో మాట్లాడిన లోకేశ్.. దాడి ఘటనపై విద్యార్థులను వివరాలు అడిగి తెలు సుకున్నారు. విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ విద్యావ్యవస్థను కాపాడేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని లోకేశ్ తెలిపారు. శాంతియుతంగా నిరసన చేసిన విద్యార్థులను కొట్టారని, విద్యార్థులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడం దారుణమని లోకేష్ విరుచుకుపడ్డారు.
``పేద పిల్లల చదువు కోసం ఆనాడు పెద్దలు భూములు దానం ఇచ్చారు. ఎయిడెడ్ కళాశాలల్లో చదివి ఎందరో ఉన్నతస్థాయికి ఎదిగారు. ఎన్టీఆర్, వెంకయ్యనాయుడు, జస్టిస్ ఎన్.వి.రమణ.. ఈ కాలేజీల్లో చదివినవారే. ఎవరినీ సంప్రదించకుండానే ఏకపక్షంగా జీవో జారీ చేశారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను దేశంలో ఎక్కడా రద్దు చేయలేదు. ఏపీలోనే ఎయిడెడ్ విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థల భూములు కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల భూములు కొట్టేసేందుకు ప్రయత్నం జరుగుతోంది`` అని లోకేష్ ధ్వజమెత్తారు.
అంతకుముందు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన లోకేశ్.. ప్రభుత్వ పథకాలన్నింటికీ జగన్ పేరు పెట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి లేదు.. కేవలం విధ్వంసం మాత్ర మే నడుస్తోందని విమర్శించారు. ఎయిడెడ్ కళాశాల భూములపై సీఎం జగన్ కన్నేశారని ఆరోపించారు. ఎయిడెడ్ కళాశాల నుంచి ఎంతోమంది రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు వచ్చారని లోకేశ్ వివరించారు. 2 వేలకు పైగా ఎయిడెడ్ పాఠశాలల్లో 2 లక్షల మంది, 182 జూనియర్ కళాశాలల్లో 71 వేల మంది విద్యార్థులున్నారని తెలిపారు.