Begin typing your search above and press return to search.

మా హోటల్లో ప్రేమించుకోండి.. హాంకాంగ్​ లో కొత్త దందా

By:  Tupaki Desk   |   7 Oct 2020 11:45 AM IST
మా హోటల్లో ప్రేమించుకోండి.. హాంకాంగ్​ లో కొత్త దందా
X
హాంకాంగ్​ దేశంలో హోటళ్ల యజమానులు కొత్త తరహా దందాకు తెరలేపారు. ప్రేమపక్షులు, ఏకాంతం కోరుకొనే జంటల కోసం ప్రత్యేకంగా హోటళ్లు నిర్మిస్తున్నారు. కేవలం శృంగారం కోరుకొనే జంటలకే కాకుండా, వారి ప్రైవసీకి ఏ మాత్రం భంగం కలుగకుండా హోటళ్లలో గదులను నిర్మించినట్టు యజమానులు చెబుతున్నారు. హాంకాంగ్​ లో యువత ఎక్కువగా తల్లిదండ్రులతోనే కలిసి ఉంటారు. దీంతో వారు ప్రైవసీని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో యువత అభిరుచులను పరిగణనలోకి తీసుకున్న హోటళ్ల యజమానులు ఈ తరహా వ్యాపారానికి తెరలేపారు. హాంకాంగ్​ లోని విక్టోరియా హార్బర్‌ సమీపంలో ఇటువంటి లవ్​ హోటళ్లు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి.

హాంకాంగ్‌లో 300 పైగా లవ్​హోటళ్లు ఉన్నాయని హాంకాంగ్‌ గెస్ట్‌హౌస్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ డేవిడ్‌ లీంగ్‌ చెప్పారు. ప్రేమపక్షులతోపాటు పెళ్లయిన జంటలు కూడా ఏకాంతం కోసం వారాంతాల్లో ఇక్కడికి వస్తుంటాయి. హాంకాంగ్‌లో సంప్రదాయ హోటళ్లకు కొదవలేనప్పటికీ, యువతీ యువకులు ప్రైవేట్‌గా కబుర్లు చెప్పుకోడానికి ఈ హోటళ్లు బాగాఉపయోగపడుతున్నాయి. హాంకాంగ్‌లో 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసున్న యువత ప్రతి 10మందిలో 9మంది తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. ఇక 25 నుంచి 34 ఏళ్ల వయసున్న వారు ప్రతి 10మంది యూత్‌లో ఆరుగురు పేరెంట్స్‌తో కలిసి జీవిస్తున్నారని 2019లో వెలువడిన హాంకాంగ్ ప్రభుత్వ నివేదికలో ఉంది. దీంతో యువత ఏకాంతానికి దూరమయ్యారు.

ఈ క్రమంలో వాళ్లు ఏకాంతాన్ని కోరుకుంటున్నారు. హాంకాంగ్​ లో ఒక ఉద్యోగి 13,000 హాంకాంగ్‌ డాలర్ల (రూ.1,22672) నుంచి 19,300 హాంకాంగ్‌ డాలర్లు ( రూ.1,82143) సంపాదించగలడు. వాళ్లు కుటుంబాలతో కలిసి అద్దె గదుల్లో ఉండాల్సి వస్తోంది. హాంకాంగ్​ లో సొంత ఇళ్లు నిర్మించుకోవడం మధ్య తరగతి ఉద్యోగులకు అంత తేలికైన విషయం కాదు. అందువల్ల వాళ్లు తల్లిదండ్రులతో కలిసి అద్దె ఇండ్లల్లోనే ఉంటున్నారు. అయితే అక్కడ అద్దెకు ఇచ్చే ఇండ్లలో డబుల్ బెడ్రూం ఉన్నా.. రెండు గదులకు ఓ సన్నని గోడ లాంటిది మాత్రమే ఉంటుంది. దీంతో యువత ప్రైవసీని భంగం కలుగుతుంది. యువత లవ్​ హోటల్స్​ ను ఎంచుకోవడానికి ఇది కూడా ఓ ప్రధాన కారణమని అక్కడి నిపుణులు చెబుతున్నారు. హాంకాంగ్​లో 70 శాతం ఇళ్లు శృంగారం చేసుకోవడానికి పనికిరావని ఓ సర్వే తేల్చి చెప్పింది.

లవ్‌ హోటళ్లపై కరోనా దెబ్బ

కరోనా దెబ్బకు ప్రస్తుతం లవ్ ​హోటల్స్​ గిరాకీ పూర్తిగా తగ్గిపోయిందట. 25 అంతస్తులున్న తమ హోటల్‌లో కేవలం రెండు, మూడు రూములను మాత్రమే రెంట్‌కు ఇచ్చిన సందర్భాలున్నాయని హాంకాంగ్‌ గెస్ట్‌హౌస్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌ డేవిడ్‌ లీంగ్‌ వెల్లడించారు. వైరస్‌ కారణంగా అవర్లీ లవ్‌ హోటళ్లలో 70% బిజినెస్‌ దెబ్బతిందని లీంగ్‌ తెలిపారు. తమ ప్రైవసీ కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా హాంకాంగ్​ యువత సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు కరోనాకు భయపడి ఎవరూ హోటళ్లవైపు రావడం లేదు. ప్రస్తుతం బిజినెస్​ కాస్త డల్​గా ఉంది అని కొందరు హోటల్​ యజమానులు అభిప్రాయపడుతున్నారు.