Begin typing your search above and press return to search.
తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి లవ్ స్టోరీ ఇదీ
By: Tupaki Desk | 1 April 2023 9:31 PM GMTఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడి వైసీపీ నుంచి సస్పెన్షన్ అయిన ఉండవల్లి శ్రీదేవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. వైసీపీపై తీవ్ర విమర్శలు చేసిన ఆమెపై ఆ పార్టీ నేతలు కూడా కౌంటర్లతో హోరెత్తిస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సస్పెండ్ అయ్యాక ఎమ్మెల్యే శ్రీదేవి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ వైసీపీ నేతల అవినీతి చిట్టా విప్పారు. ఇక వైసీపీ నేతలు కూడా శ్రీదేవి అవినీతికి పాల్పడిందంటూ ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అలాంటి శ్రీదేవి ఎవరు? ఆమె కథేంటి? అన్నది తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.ఆమె లవ్ స్టోరీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎమ్మెల్యే శ్రీదేవి హైదరాబాద్ లో ప్రముఖ గైనకాలజిస్ట్ గా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. ఎస్సీ నియోజకవర్గమైన తాడికొండ నుంచి వైసీపీ తరుఫున టికెట్ తెచ్చుకొని గత ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. ఇక ఆమె భర్త డాక్టర్ శ్రీధర్ కూడా ప్రముఖ యూరాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. వీరిద్దరి ప్రేమ పెళ్లికి సంబంధించిన విషయాలు ఇప్పుడు బయటకొచ్చాయి.
శ్రీదేవి, శ్రీధర్ లు పీజీ చేసే సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ల లవ్ స్టోరీ ఎంతో ఆసక్తికరంగా ఉంది. శ్రీదేవి కంటే శ్రీధర్ సీనియర్. పైగా టాపర్ గా ఉంటూ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ గా ఉన్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఒకే కాలేజీలో కలుసుకోవడం.. పరీక్షలు, ప్రయోగ శాలల్లో ఒకరినొకరు సాయం చేసుకోవడం జరిగింది. శ్రీదేవికి శ్రీధర్ చాలా ఇన్సిపిరేషన్ ఇచ్చి ప్రోత్సహించారు.
ఇక శ్రీదేవి గైనకాలజిస్ట్, శ్రీధర్ యూరాలజిస్ట్ కావడంతో ఇద్దరూ కలిసి సర్జరీలను చేయడం అలా ఇద్దరూ ప్రొఫెషన్ కోసం.. ఇక తమ కెరీర్, ఇష్టాయిష్టాలు కలిసి ప్రేమించుకున్నారు. అనంతరం పెద్దలకు చెబితే వారు ఎలాంటి అడ్డూ చెప్పలేదు. ఇలా కులాలు వేరు అయినా కూడా పెళ్లి చేసుకున్నారట..
నిజానికి పెళ్లి చేసుకునే సమయానికి ఓసీ అయిన శ్రీధర్ కు ఎస్సీ అయిన శ్రీదేవి కులం తెలియదట.. అందంగా ఉండడం.. డాక్టర్ కావడంతో ఇద్దరి కుటుంబాల్లోనూ అసలు కులమే అడగకుండా పెళ్లి చేసుకున్నారు. అలా ఓసీ,ఎస్సీలని కులాలు కూడా తెలియకుండానే వీరి ప్రేమ ఒక్కటి చేసిందని వాళ్లు తెలిపారు.
ఇప్పటికీ ఎస్సీ మహిళ, కాపు అన్న బేధాలు తమ కుటుంబంలో ఉండవని.. కేవలం రాజకీయాల్లోకి వచ్చాకనే ఎస్సీ సర్టిఫికెట్ ను తీసుకొని ఎమ్మెల్యేగా పోటీచేశానంటూ శ్రీదేవి తెలిపారు. అప్పుడే ఈ విషయం తన భర్త శ్రీధర్ కు తన కులం గురించి తెలిసిందని వివరించారు.
ఇక తన పెద్ద కూతురు బాగా తెలివైందని.. చక్కగా మాట్లాడుతుందని.. సివిల్స్ ప్రిపేర్ అవుతోందని శ్రీదేవి తెలిపింది. చిన్న కూతురు మెడిసన్ చదువుతోందని వివరించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.