Begin typing your search above and press return to search.
నామా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు .. కంపెనీ డైరెక్టర్లకు ఈడీ పిలుపు !
By: Tupaki Desk | 15 Jun 2021 5:32 AM GMTఎంపీ నామా నాగేశ్వరరావు ... టీఆర్‌ఎస్ ఖమ్మం ఎంపీ. తాజాగా ఎంపీ నామా నాగేశ్వరరావు కంపెనీల్లో ఈడీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఎంపీకి చెందిన ‘రాంచీ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్’ డైరెక్టర్లను త్వరలోనే ఈడీ ప్రశ్నించనుంది. ఈ కంపెనీ నుంచి పలు కారణాలు చెప్పి, ఇతర కంపెనీలకు మళ్లించిన రూ.264 కోట్ల విషయంపై విచారణ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రోడ్డు నిర్మాణం కోసం తీసుకున్న రుణాలను అందుకే ఖర్చు చేయాలి , కానీ దానికి కాకుండా వేరే మార్గాల ద్వారా ఎందుకు పంపించాల్సి వచ్చిందన్న విషయంపై ఈడీ విచారణ దర్యాప్తు చేస్తుంది. దీనిపై సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే ఈ వ్యవహారంపై ఈడీ అధికారులు ముగ్గురు డైరెక్టర్లను ప్రశ్నించి మరిన్ని వివరాలు రాబట్టాలని ప్రయత్నాలు మొదలుపెట్టారట.
రూ.1,151 కోట్ల విలువైన రాంచీ-రార్ గావ్- జంషెడ్ పూర్ వరకు 163 కి.మీ. మేర ఉన్న ఎన్ హెచ్–33 4 లేన్ల రహదారి పనుల ప్రాజెక్టును మధుకాన్ కంపెనీ 2011లో దక్కించుకుంది. ఇందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ కింద రాంచీ ఎక్స్ ప్రెస్ వే లిమిటెడ్ ను ఏర్పాటు చేశారు. దీనికి డైరెక్టర్లుగా కె.శ్రీనివాస్‌రావు, ఎన్.సీతయ్య, ఎన్.పృథ్వీతేజ వ్యవహరిస్తున్నారు. రహదారి ప్రాజెక్టు పనులను చూపించి రూ.1,029.39 కోట్లు బ్యాంకుల కన్సార్షియం నుంచి రాంచీ ఎక్స్‌ప్రెస్ వే లోన్ పొందింది. ఈ కన్సార్షియానికి కెనరా బ్యాంకు లీడ్ బ్యాంకుగా వ్యవహరించింది. ఆ తర్వాత మధుకాన్ పై ఆరోపణలు రావడంతో వాస్తవాలు తేల్చాలని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ను జార్ఖండ్ హైకోర్టు ఆదేశించింది. తీసుకున్న రుణంలో నుంచి రూ.264.01 కోట్లు పక్కదారి పట్టాయని ఎస్ ఎఫ్ ఐఓ నివేదిక ఇచ్చింది.
రౌండ్ ట్రిప్పింగ్ ఎక్సర్ సైజ్ కింద రూ.50 కోట్లు, డైవర్షన్ మొబిలైజేషన్, మెటీరియల్ అడ్వాన్స్ కింద రూ.22 కోట్లు, మెయింటెనెన్స్ పేరిట రూ.98 కోట్లు, మెటీరియల్ యుటిలైజేషన్– మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద మధుకాన్ ప్రాజెక్టు లిమిటెడ్ కు రూ.94.01 కోట్లు, ఇలా మొత్తం రూ.264.01 కోట్లు మళ్లించారని ఎస్ ఎఫ్ ఐఓ నివేదించింది. 2019 మార్చిలో రంగంలోకి దిగిన సీబీఐ ఈ వ్యవహారంలో వారికి కోటా ఆడిట్ కంపెనీ సాయం చేసిందని గుర్తించింది. మధుకాన్ ప్రైవేట్ లిమిటెడ్, మధుకాన్ ఇన్ ఫ్రా లిమిటెడ్, మధుకాన్ టోల్ హైవే లిమిటెడ్, కోటా ఆడిట్ కంపెనీ, గుర్తు తెలియని బ్యాంకు ఉద్యోగులపై ఫోర్జరీ, నకిలీ పత్రాల సృష్టి, తప్పుడు పద్దుల నిర్వహణల ఆరోపణల కింద కేసు నమోదు చేసింది. రుణాలు మంజూరైనా పనుల్లో పెద్దగా పురోగతి లేదని సీబీఐ ఎఫ్ ఐఆర్ లో పేర్కొంది.