Begin typing your search above and press return to search.
గడపగడపలో వైసీపీ ఎమ్మెల్యే చేయి చేసుకున్నాడు... ఎందుకంటే!
By: Tupaki Desk | 4 Feb 2023 3:00 PM GMTసమస్యల పరిష్కారం.. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు ఏమను కుంటున్నారు.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉన్న సంబంధం ఎలా ఉంది? వంటి కీలక విషయాలపై ఆ రా తీసి ప్రభుత్వ , వైసీపీ గ్రాఫ్‌లను పెంచాలనే ఉద్దేశంతో వైసీపీ అధినేత సీఎం జగన్ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమాన్ని అందరూ నిర్వహించాలని కూడా ఆయన షరతు పెట్టారు.
అయితే.. ఈ క్రమంలో ప్రజల వద్దకు వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేలకు కొన్ని కొన్ని చోట్ల ప్రశ్నలు ఎదురవు తున్నాయి. సమస్యలు ఆహ్వానం పలుకుతున్నాయి.
దీంతో కొందరు సర్దిచెబుతుండగా.. మరికొందరు ఎమ్మెల్యేలు మాత్రం ఫైర్ అవుతున్నారు. ప్రజలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా అయితే.. ఏకంగా తనను ప్రశ్నించిన వ్యక్తిపై వైసీపీ ఎమ్మెల్యేచేయి కూడా చేసుకున్నారు. దీంతో ఎమ్మెల్యేను ప్రజలు కొద్ది సేపు నిర్బంధించారు.
ఏం జరిగిందంటే..
అన్నమయ్య జిల్లాలో సమస్య గురించి మాట్లాడినందుకు వైసీపీ సానుభూతి పరుడిపై..మదనపల్లె వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ బాషా చేయి చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు ఎమ్మెల్యేను నిలదీశారు. వైసీపీ సానుభూతి పరుడ్ని పోలీసులు స్టేషన్కు తరలించారు. దీంతో కొందరు గ్రామస్తులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని అదుపులోకి తీసుకున్న వ్యక్తిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా మరోవైపు తొగటవీర క్షత్రియ సంఘం నాయకులు ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి మాట్లాడారు. ఈ సమయంలో అక్కడ తోపులాట జరగటంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ఎం నవాజ్ బాషా గ్రామంలో గడప గడపకు కార్యక్రమం నిర్వహిస్తుండగా.. వైసీపీ సానుభూతిపరుడు లక్ష్మీనారాయణ రోడ్డు సమస్యపై ఎమ్మెల్యేను ప్రశ్నించాడు.
తమ కాలానీలో ఉన్న రోడ్డుపై మరో రోడ్డు నిర్మిస్తే ఇప్పుడు ఉన్న ఇళ్లు ఎత్తు తగ్గుతుందన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే అతనిపై చేయి చేసుకున్నాడని వారు తెలిపారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు లక్ష్మీనారాయణను మదనపల్లి వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎమ్మెల్యే తీరుపై గ్రామస్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. సమస్య గురించి చెప్తే ఇలా చేయి చేసుకుంటారా అని ప్రశ్నించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.