Begin typing your search above and press return to search.

అయోధ్య రామమందిరానికి రూ.10 కోట్ల విరాళం

By:  Tupaki Desk   |   9 Feb 2020 12:30 PM GMT
అయోధ్య రామమందిరానికి రూ.10 కోట్ల విరాళం
X
సుదీర్ఘకాలం అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తన చారిత్రక తీర్పుతో ఒక కొలిక్కి తీసుకురావటం తెలిసిందే. రామాలయ నిర్మాణానికి సంబంధించి కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని.. అందుకు తగ్గట్లే గడువు లోపు కేంద్రంలోని మోడీ సర్కారు ఇటీవల ఒక కమిటీని వేయటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. రామాలయ నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం ఏం చేయాలన్న ఆలోచన చేస్తున్న వేళ.. విరాళాలు కుప్పలుకుప్పలుగా పోటెత్తుతున్నట్లుగా చెబుతున్నారు. ఎక్కడిదాకానో ఎందుకు బిహార్ రాష్ట్ర రాజధాని పాట్నాకు చెందిన మహవీర్ ఆలయ పాలక మండలి రామాలయం కోసం ఏకంగా రూ.10 కోట్ల మొత్తాన్ని విరాళంగా వెల్లడించింది.

అంతేకాదు.. తాను ప్రకటించిన విరాళానికి సంబంధించి రూ.2 కోట్ల మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశారు కూడా. తాను పేర్కొన్నట్లుగా మిగిలిన మొత్తాన్ని దశల వారీగా ఇవ్వనున్నట్లు చెప్పారు. మందిరం నిర్మాణం కోసం తాము ఏర్పాటు చేసిన డొనేషన్ బాక్సులో అత్యంత పాత.. విలువైన నాణాలు కూడా విరాళాల రూపంలో పడుతున్నాయని చెబుతున్నారు. ఇలా వస్తున్న నాణెల్లో కొన్ని అత్యంత పురాతనమైన నాణాలు ఉండటం గమనార్హం.

అణా పైసా విలువ చేసే 30 నాణేలను భక్తులు వేశారని.. అదే రీతిలో భక్తులు వేసిన నాణాలలో సీతారాములు.. లక్ష్మణుడు.. హనుమంతుడి చిత్రాలుగా ఉన్న నాణాలతోపాటు.. ఈస్ట్ ఇండియా వేళలో రూపొందించిన నాణెలు కూడా వస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా రామాలయ నిర్మాణానికి అవసరమైన అన్నిఏర్పాట్లను చేయటంతో పాటు.. భక్తులు చెల్లించాల్సిన మొక్కుల్ని ప్రత్యేకంగా తీర్చుకోవటం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.