Begin typing your search above and press return to search.
అసద్ నోట కింగ్ మేకర్ మాట.. అంటే కేసీఆర్ కష్టాల్లో ఉన్నారా?
By: Tupaki Desk | 27 Jun 2023 9:23 AM GMTఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వందకు పైగా సీట్లలో విజయం సాధిస్తామన్న మాటను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. ఎన్నికల్లో గెలుపు మీద ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అదే నిజమైనప్పుడు ఆయనకు ఏ మిత్రుడి అవసరం లేనట్లే. కానీ.. ఆయన మిత్రుడు.. కీలక సమయాల్లో సేవియర్ గా వ్యవహరించారని చెప్పే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి తాజాగా కోపం వచ్చింది.
తన స్నేహితుడి మీద ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికర చర్చకు తెర తీశాయి. హైదరాబాద్ లోని ఏడు నియోజకవర్గాల్లో తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తూ.. దశాబ్దాల తరబడి తాము మాత్రమే గెలిచేలా మార్చుకున్న నియోజకవర్గాల నేపథ్యంలో.. అంతకు మించి విస్తరణ మీద మజ్లిస్ ఫోకస్ చేసింది లేదు.
తాజాగా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తామన్న మాట అసద్ నోటి నుంచి వచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము మరిన్నిస్థానాల్లో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.
తాజాగా నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. బోధన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ చేసిన ఫిర్యాదు నేపథ్యంలో మజ్లిస్ నేతలు అరెస్టు కావటంతో వారిని పరామర్శించిన అసద్.. అనంతరం మాట్లాడుతూ.. తాము వచ్చే ఎన్నికల్లో కింగ్ మేకర్ పాత్రను పోషించనున్నట్లు పేర్కొన్నారు.వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తామన్న ఆయన.. ఎన్నికల ముందు జాబితాను ప్రకటిస్తామని చెప్పారు.
బోధన్ లో మజ్లిస్ పోటీ చేస్తుందన్న ఆయన.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కు తగిన బుద్ధి చెబుతామని వ్యాఖ్యానించారు. మజ్లిస్ కౌన్సిలర్ల మీదా.. తమ పార్టీ నేతల మీదా అక్రమ కేసులు పెట్టారని.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్.. డీజీపీ దృష్టికి తీసుకెళతామన్న ఆయన.. అరెస్టు అయిన నేతలు.. ఎమ్మెల్సీ కవితలు షకీల్ గెలుపు కోసం పని చేశారన్న విషయాన్ని గుర్తు చేశారు.
ఓవైపు కేసీఆర్ వందకు పైగా సీట్లలో విజయం ఖాయమని బల్లగుద్ది చెబుతున్న వేళ.. అందుకు భిన్నంగా అసద్ మాత్రం తాము కింగ్ మేకర్ పాత్ర పోషిస్తామని చెప్పటం చూస్తే.. గులాబీ బాస్ చెప్పినట్లుగా ఆయనకు అంత బలం లేదన్న విషయాన్ని అసద్ చెప్పకనే చెప్పేశారా? అన్నద ప్రశ్నగా మారింది.
కేసీఆర్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో మాత్రమే మజ్లిస్ కింగ్ మేకర్ పాత్ర పోషించే వీలుంది. ఆ మాత్రం సీట్లు కూడా రావన్న మాట కేసీఆర్ మిత్రుడి నోటి నుంచే వచ్చిందంటే.. తెలంగాణలో బీఆర్ఎస్ కు డేంజర్ బెల్స్ మోగుతున్నట్లేగా? అన్నదిప్పుడు చర్చగా మారింది.