Begin typing your search above and press return to search.
పవన్ సినిమాలో మల్లారెడ్డి విలన్!
By: Tupaki Desk | 26 March 2023 7:21 PM GMTఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన రాజకీయ నేతల్లో ఒకరు.. మల్లారెడ్డి. మల్లారెడ్డి విద్యా సంస్థలతో పాటు అనేక వ్యాపారాల్లో బాగా ఆర్జించి రాజకీయాల్లోకి వచ్చిన మల్లారెడ్డి చాలా వేగంగానే ఎదిగారు.
కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా చేపట్టారు. కాగా రాజకీయ సభల్లో అయినా.. వేరే కార్యక్రమాల్లో అయినా.. మల్లారెడ్డి ప్రసంగాలు భలే ఆసక్తికరంగా.. పంచ్ డైలాగులతో సాగుతుంటాయి.
ముఖ్యంగా ఈ మధ్య అసెంబ్లీలో తన ప్రస్థానం గురించి వివరిస్తూ.. పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడినా.. అంటూ రైమింగ్‌తో సాగిన ప్రసంగం సూపర్ హిట్ అయింది. సోషల్ మీడియాలో మీమ్ పేజీలకు ఆయన పెద్ద కంటెంట్‌గా మారిపోయారు. ఇలాంటి టైంలోనే మల్లారెడ్డికి సినిమా అవకాశం కూడా వచ్చిందట. అది కూడా పవన్ కళ్యాణ్ సినిమా కావడం విశేషం.
పవన్ కళ్యాణ్ సినిమాలో తనను విలన్ పాత్ర కోసం దర్శకుడు హరీష్ శంకర్ అడిగాడని.. దీని మీద గంటన్నర పాటు మాట్లాడాడని.. కానీ తాను ఆ పాత్ర చేయడానికి అంగీకరించలేదని మల్లారెడ్డి వెల్లడించడం విశేషం. హైదరాబాద్‌లో ఆదివారం 'మీమ్ ఫేమస్' సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా మల్లారెడ్డి ఈ విషయం వెల్లడించడం విశేషం.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ''23 ఏళ్లు ఉణ్నపుడు నాకు పెళ్లి అయింది. అప్పుడు నా దగ్గర ఏమీ లేదు. పాలు అమ్ముకునేవాడిని. కష్టపడి ఎదిగాను. కేసీఆర్ ఆశీర్వాదంతో మంత్రిని అయ్యాను. కాబట్టి ఇప్పటికైనా యూత్ షికార్లు బంద్ చేసి జీవితంలో ముందుకెళ్లడంపై దృష్టిపెట్టాలి. ఈ సినిమా టీజర్ నాకెంతో నచ్చింది. తప్పకుండా సక్సెస్ అవుతుంది.
ఇది సక్సెస్ అయ్యాక ఈ హీరోతో నేనో సినిమా చేస్తా. అలాగే ఎన్నికలు అయిపోయాక తెలంగాణ యాసలో సినిమాలు నిర్మిస్తా. హరీష్ శంకర్ మా ఇంటికి వచ్చాడు. గంటన్నర బతిమాలాడు. పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ పాత్ర చేయమన్నాడు. కానీ నేను చేయనని చెప్పేశా'' అని మల్లారెడ్డి తెలిపాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.