Begin typing your search above and press return to search.
చోరీ చేసిన విమానంతో అమెరికా గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు
By: Tupaki Desk | 4 Sep 2022 5:27 AM GMTకొన్నేళ్ల క్రితం అల్ ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ విమానాల్ని హైజాక్ చేసి.. ట్విన్ టవర్స్ ను ఢీ కొట్టిన ఉదంతం.. ఆ సందర్భంగా చోటు చేసుకున్న ప్రాణనష్టం.. ఆస్తి నష్టం అమెరికా చరిత్రలోనే అత్యంత షాకింగ్ ఘటనగా చెప్పక తప్పదు. ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునే అగ్రరాజ్యానికి దిమ్మ తిరిగేలా షాకివ్వటంతో పాటు.. అమెరికన్లకు తొలిసారి అనిశ్చిత వణుకు తెప్పించిన వైనం తెలసిందే.
తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి అగ్రరాజ్యంలో చోటు చేసుకుంది. చోరీ చేసిన విమానం (9సీట్లు సామర్థ్యం ఉన్న ఫ్లైట్) భారీ సూపర్ మార్కెట్ అయిన వాల్ మార్ట్ మీద కూల్చేస్తానంటూ చేసిన ప్రకటన అమెరికాకు వణుకు తెప్పించింది. గత అనుభవాల నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన సూపర్ మార్కెట్ ను.. చుట్టూ ఉన్న ప్రాంతాల్ని ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేసి ఆగమాగం అయ్యారు.
అమెరికాలోని మిస్సిస్సిప్పి లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఆ స్టేట్ లో బుల్లి విమానాన్ని దొంగలించిన ఒక పైలెట్ ఒకరు వాల్ మార్ట్ స్టోర్ మీద కూల్చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో మొదలైన కలకలం కొద్ది గంటల పాటు సాగింది. శనివారం తెల్లవారుజామున ఐదు గంటల పరాంతంలో టుపే ఎయిర్ పోర్టు నుంచి 9 సీట్ల ఉన్న బుల్లి ఎయిర్ క్రాఫ్ట్ ను చోరీ చేశాడు.
దాన్ని నగరం మీద గంటకు పైగా చక్కర్లు కొట్టించాడు పైలెట్. అత్యవసర నంబరు అయిన 911కు ఫోన్ చేసి.. తాను ప్రయాణిస్తున్న విమానాన్ని వాల్ మార్ట్ స్టోర్ మీద కూల్చేస్తానని వార్నింగ్ ఇవ్వటంతో అధికారులు.. పోలీసులు ఉలిక్కిపడ్డారు. వెంటనే స్పందించిన వారు.. వాల్ మార్ట్ ను ఖాళీ చేయించటంతో పాటు.. చుట్టుపక్కల ఉన్న వారిని కూడా ఖాళీ చేయించారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు బయట ఉండాలని ఆదేశించారు.
విమానాన్ని కూల్చేస్తానని వార్నింగ్ ఇచ్చిన గుర్తు తెలియని పైలెట్ ఉదంతంతో ఆ రాష్ట్ర గవర్నర్ టేట్ రీవ్స్ రియాక్టు అయ్యారు. పోలీసులు.. అత్యవసర సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలు జాగరూకతో ఉండాలని కోరారు. విమానాన్ని భూమికి 1100 అడుగుల ఎత్తులో గంటకు 206 మైళ్ల వేగంతో చక్కర్లు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. అయితే.. ఈ విమానం క్రాష్ ల్యాండ్ అయినట్లుగా గుర్తించారు. ఆష్ లాండ్ కు నైరుతి ప్రాంతంలో విమానాన్ని క్రాష్ ల్యాండ్ అయిన వెంటనే.. పైలెట్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడ్ని విచారిస్తున్నారు. ఫ్లైట్ దొంగతనం వెనుక అతడొక్కడే ఉన్నాడా? ఇంకెవరైనా ఉన్నారా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ బయటకు రావాల్సి ఉంది.