Begin typing your search above and press return to search.
బాబు బెస్ట్ ఫ్రెండ్ కోరిక తీరుతుందా..!
By: Tupaki Desk | 29 July 2016 10:15 AM GMTరాజకీయాల్లో కొందరు అనూహ్యంగా పదవులు అందుకుంటారు. మరికొందరికి మాత్రం ఎంత ప్రయత్నించినా పదవులు దక్కడం అనేది ఉండదు. ఆ నేతలకు ఆయా పార్టీల్లో ఎంతో పలుకుబడి - ప్రజల్లో ఎంతో ఆదరణ ఉన్నప్పటికీ...వారి కోర్కెలు మాత్రం తీరవు. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే.. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు చెందిన టీడీపీ సీనియర్ నేత పి.మనోహర్ నాయుడి పరిస్థితి ఇలానే ఉందికాబట్టి. మనోహర్ నాయుడు.. టీడీపీలో సీనియర్ నాయకుడు - ఈయన తండ్రి సహదేవనాయుడు కూడా టీడీపీలో సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిగారు. అంతేకాకుండా.. మనోహర్‌నాయుడు టీడీపీ అధినేత చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు కూడా. కానీ, ఎమ్మెల్యే కావాలనుకున్న మనోహర్ కోరిక మాత్రం తీరడం లేదు. ఇది ఆయనను మానసికంగా వేధిస్తున్న ఆవేదన. ఇక, విషయంలోకి వచ్చేస్తే..
చంద్రబాబు కుటుంబంతో మనోహర్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. ఇటీవలి కాలంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కు చాలా దగ్గరయ్యారు. పాచిగుంట గ్రామంలో జరిగిన మనోహర్ నాయుడు కూతురు వివాహానికి చంద్రబాబు హాజరయ్యారు. ఇంతటి సన్నిహిత సంబంధాలు ఉండి కూడా మనోహర్ నాయుడు తన కోరికను తీర్చుకోలేక పోతున్నారు. నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు అంకితభావంతో పని చేస్తూ...బలమైన నాయకుడిగా ప్రజల్లోనూ.. పార్టీ క్యాడర్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో చంద్రబాబు ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు. అయితే, ఎప్పటి నుంచో ఎమ్మెల్యే కావాలనుకున్న మనోహర్ కు ఆ కోరిక మాత్రం తీరడం లేదు. దీనికి చంద్రబాబు ఏమన్నా వ్యతిరేకమా అంటే కానేకాదని చెప్పవచ్చు.
మరి ఎందుకు మనోహర్ కోరిక తీరడం లేదంటే.. గంగాధర నెల్లూరు నియోజకవర్గం రిజర్వుడు కావడమే! దీంతో మనోహర్ కి అవకాశం దక్కడంలేదు. గతంలో ఈ మండలం వేపంజరి నియోజకవర్గంలో ఉండేది అప్పుడు కూడా అది రిజర్వ్‌డ్ నియోజకవర్గమే. ఆయన కష్టాన్ని గుర్తించిన చంద్రబాబు ఆయనకు జిల్లా తెలుగు రైతు అధ్యక్ష పదవిని అప్పగించారు. గతంలోనూ మనోహర్ ఈ పదవిలో పనిచేయడం గమనార్హం. అయితే, తాజాగా ఆయన తన బలాన్ని నిరూపించుకున్నారు. ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే..ఎంతటి సంబరం చేసుకుంటారో.. అంతకన్నా ఎక్కువే చేసుకున్నారు మనోహర్. జిల్లా పార్టీ కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని మనోహర్ చాలా గ్రాండ్ గా జరిపించారు. తన ఆర్భాటాన్ని చాటుకున్నారు. పదవి కంటే పాపులారిటీ ముఖ్యమని అనుకున్నారో ఏమో కానీ ఇద్దరు మంత్రులు.. పలువురు ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. నియోజకవర్గం ఇన్ ఛార్జ్ లు.. పార్టీ శ్రేణులు.. అభిమానులు ఇలా అందరికీ కబురు పెట్టారు.
ప్రమాణస్వీకారోత్సవ వేదిక వరకు బ్రహ్మాండమైన ర్యాలీ సాగింది.. భారీ జనసందోహం మధ్యన.. బాణాసంచా చప్పుళ్లతో...బ్యాండ్ వాయిద్యాల మోతలతో... సాంస్కృతిక కార్యక్రమాల సందళ్లతో అటు మంత్రులు.. ఇటు జిల్లా ప్రజాప్రతినిధులు మధ్య మనోహర్ ఊరేగింపు సుమారు రెండు గంటల పాటు అదిరిపోయింది. దీనికి హాజరైన మంత్రి పత్తిపాటి పుల్లారావు.. బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలు మనోహర్‌పై పొగడ్తలతో ముంచెత్తారు. మనోహర్ బలమేమిటో.. ఎంతమంది ప్రజలు ఆయన వెంట ఉన్నారో... ఆయన సత్తా ఏ పాటిదో ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత తెలిసిందన్నారు. మరి చంద్రబాబు.. మనోహర్ నాయుడి కోరికను ఎలా తీరుస్తారో.. ఎప్పుడు తీరుస్తా...ఎలా నెరవేరుతుందో చూడాలి.