Begin typing your search above and press return to search.
బోరబండలో భూకంపం.. ఎంతవరకు నిజం?
By: Tupaki Desk | 3 Oct 2020 5:00 AM GMTశుక్రవారం రాత్రి వరకు ప్రశాంతంగా ఉన్న హైదరాబాదీయులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. టీవీల్లో బ్రేకింగ్ న్యూసులు.. వాట్సాప్ గ్రూపుల్లో వరుస ఫోటోలు.. వీడియోలతో భయాందోళనకు గురయ్యారు. దీనికి కారణం నగరం నడిబొడ్డున అన్నట్లు ఉండే బోరబండ ప్రాంతంలో వింత శబ్దాలతో పాటు.. భూమి కంపించిన తీరు అక్కడి వారికి దడ పుట్టేలా చేసింది.
దీంతో ఉలిక్కిపడిన వారు.. ఒక్కసారిగా ఆందోళనకు గురై.. ఇళ్లల్లో నుంచి పరుగులు పెడుతూ బయటకు వచ్చేశారు. దీంతో.. బోరబండలోని ఫేజ్ త్రీలోని ప్రాంతమంతా హడావుడి నెలకొంది. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వింత శబ్దాలకు కారణం స్వల్పంగా వచ్చిన భూకంపంగా పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. శుక్రవారం రాత్రి పన్నెండు గంటల సమయంలో (మరింత కచ్ఛితంగా చెప్పాలంటే 11.46 గంటలకు) మరోసారి స్వల్పంగా భూమి కంపించటంతో మరింత ఆందోళన నెలకొంది.
మొత్తంగా శుక్రవారం రాత్రి రెండు దఫాలు వచ్చిన భూప్రకంపనలు బోరబండ వాసులకు నిద్ర లేకుండా చేస్తే.. నగర వాసుల్లో ఆందోళనను పెంచింది. అయితే.. స్వల్పంగా వచ్చిన ఈ భూప్రకంపనలతో ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేస్తున్నారు. శాస్త్రవేత్తలు ఎంత చెబుతున్నా.. సామాన్యుల్లో మాత్రం ఆందోళనలు మాత్రం తగ్గలేదు.
గడిచిన పదిహేను రోజులుగా చిన్న చిన్న శబ్దాలు వస్తున్నాయని.. అవి శుక్రవారం మరింత పెద్దగా వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి ఎనిమిది నుంచి దాదాపు గంటన్నర పాటు శబ్దాలు వచ్చాయి. ఏం జరగదులే అన్న ధీమాతో ఉన్న వారికి అర్థరాత్రి వేళ వచ్చిన స్వల్ప ప్రకంపన మరింత ఆందోళనకు గురి చేసిందని చెప్పక తప్పదు.
మూడేళ్ల క్రితం కూడా ఇదే తరహాలో శబ్దాలు రావటం.. భూ ప్రకంపనలు చోటు చేసుకోవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో బోరబండ భూప్రకంపనలపై ఎన్ జీఆర్ఐ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీ నగేష్ స్పందించారు. ఆయన్ను కొన్ని మీడియా సంస్థలు ప్రత్యేకంగా మాట్లాడాయి.
ఆయన చెప్పిన విషయాల్ని చూస్తే.. భూకంపం వెనుక కారణం ఏమిటన్న విషయంతో పాటు.. దాని తీవ్రత ఎంతన్న విషయం మీదా క్లారిటీ వచ్చేస్తుంది. బోరబండ ప్రాంతంలో చిన్నచిన్న భూకంపాలు రావటం సహజమేనని.. ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఆయన చెబుతున్నారు. 2017లొ కూడా ఇదే తరహాలో భూకంపం వచ్చిందని గుర్తు చేశారు.
బోరబండ అంటేనే.. బండలు (కొండరాళ్లు) ఉన్న ప్రాంతమన్నవిషయాన్ని మరచిపోకూడదన్నారు. అలాంటిచోట్ల అదే పనిగా బోర్లు వేశారని.. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పగళ్లు చోటు చేసుకున్నాయని చెప్పారు. అక్కడ భవన నిర్మాణాలు అధికంగా ఉండటంతో భారీగా బోర్లు వేసి.. నీళ్లు తోడేసిన వైనాన్ని మర్చిపోకూదంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఖాళీగా ఉన్న పగుళ్లలోకి వర్షపు నీరు పోయి.. సర్దుకుంటున్నాయని చెప్పారు.
ఆ సమయంలో వచ్చే శబ్దాలే స్థానికులకు భయాందోళనలు కలిగించినట్లుగా చెప్పారు. ఇలాంటి సమయాల్లోనే పెద్ద పెద్ద శబ్దాలతో కుదుపులు ఏర్పడితే భూమి కంపిస్తుందని చెప్పారు. బోరబండలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 1.4గా నమోదైందన్నారు. ఇది కేవలం సెకండ్ వ్యవధిలోనే సంభవిస్తుందని చెప్పిన ఆయన.. ఈ భూప్రకంపనలతో ఎలాంటి నష్టం ఉండదన్నారు.