Begin typing your search above and press return to search.
మెగా ఇంజనీరింగ్ సంస్థలో భారీ చోరీ ..దొంగని పట్టుకున్న పోలీసులు !
By: Tupaki Desk | 7 Aug 2020 8:10 AM GMTమేఘా ఇంజినీరింగ్ సంస్థ .. ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా రికార్డు సమయంలో పూర్తి చేసిన సంస్థగా మేఘా గుర్తింపు పొందింది. ఆ తరువాత ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రధాన ప్రాజెక్ట్ రీ-టెండరింగ్ కి పోయిన సంగతి తెలిసిందే. ప్రధాన ప్రాజెక్ట్ రీ టెండరింగ్ తో రూ.628 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యాయి. గతంలో కంటే 12.6 శాతం తక్కువకు పనులు చేసేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ముందుకొచ్చింది. ఏపీ ప్రభుత్వం రూ.4,987 కోట్లకు టెండర్ పిలవగా.. రూ.4,358 కోట్లకు మేఘా ఇంజనీరింగ్ టెండర్ వేసింది. హెడ్ వర్క్స్, జల విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను మేఘా సంస్థ చేపట్టింది.
ఇకపోతే, తాజాగా పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్ట్ దగ్గర మెగా ఇంజనీరింగ్ సంస్థ ఆఫీస్‌లో భారీ దొంగతనం జరిగింది. రూ.50 లక్షల నగదు దుండగులు ఎత్తుకెళ్లారు. దీనితో మెగా ఇంజనీరింగ్ సంస్థ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్యూరిటీ గార్డులపై సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే విచారణ మొదలుపెట్టి నిందుతులని పట్టుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ మెగా కనష్ట్రక్షన్స్ లో అపహరణ కు గురైన రూ.51 లక్షలు నగదు అద్దంకిలో పట్టుకున్నారు. అలాగే, అద్దంకి పోలీసులు సెక్యూరిటీ గార్డు మధుసూదన రెడ్డి అదుపులో తీసుకున్నారు.