Begin typing your search above and press return to search.
ఈ ఫార్ములా కార్ రేసు వెనుక ఉన్నది మెగా క్రిష్ణారెడ్డినా?
By: Tupaki Desk | 20 Nov 2022 6:42 AM GMTగడిచిన కొద్ది రోజులుగా ఒకటే హడావుడి. హైదరాబాద్ ఇమేజ్ ను పెంచేందుకు అరుదైన ఫార్ములా కార్ రేస్ ఫిబ్రవరిలో జరగనున్న విషయం తెలిసిందే. దీనికి ముందే.. ప్రాక్టీస్ కోసమని శనివారం నుంచి రేస్ ప్రాక్టీసు మొదలు కావటం.. డిసెంబరులో మరో ఈవెంట్ జరగటం.. మిగిలిన మెగా ఈవెంట్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చోటు చేసుకోవటం తెలిసిందే. ఎన్టీఆర్ మార్గ్ మొదలు కొని ప్రసాద్ ఐమాక్స్ వరకు ఉన్న మూడు కిలోమీటర్ల దూరాన్ని ప్రత్యేకమైన రోడ్డును నిర్మించి.. రేస్ కు తగినట్లుగా ముస్తాబు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఐమ్యాక్స్ పక్క నుంచి రేస్ ప్రారంభమై..ఎన్టీఆర్ మార్గ్ మీదుగా మొదలై.. లుంబినీ పార్క్ ముందు యూ టర్న్ తీసుకుంటుంది.ఆ తర్వాత ఎన్టీఆర్ పార్క్ లోపల వేసిన ట్రాక్ నుంచి ఐ మ్యాక్స్ మీదుగా తిరిగి ఐమాక్స్ పక్కకు చేరుకోవడంతో ఈ రేస్ ముగుస్తుంది. భారీగా మూల మలుపులతో రేసర్లు ఎంజాయ్ చేసేలా.. ఈ స్పోర్ట్స్ ను చూసే వారంతా థ్రిల్ కు గురయ్యే ఏర్పాట్లు సాగాయి.
ఈ రేస్ ప్రాక్టీస్ జరగటానికి ఒక రోజు ముందు.. తర్వాత ఒక రోజు మొత్తంగా నాలుగు రోజుల పాటు అత్యంత రద్దీగా ఉండే.. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ప్రాంతాన్ని రాకపోకలకు వీల్లేకుండా మూసేయటం తెలిసిందే. ఫిబ్రవరిలో జరిగేది ఈ కారు రేస్ అయితే.. ఇప్పుడు మాత్రం జరుగుతున్నది ఫ్యూయల్ కారు రేసు ప్రాక్టీస్ మాత్రమే. హుస్సేన్ సార్ తీరాన జరిగే ఈ కార్యక్రమానికి మొత్తం ఆరు టీమ్ లు.. 12 కార్లు.. 24 మంది రైడర్లు హైదరాబాద్ కు వచ్చారు.
గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే కార్లతో రేసర్లు రంగంలోకి దిగనున్నారు. ఆరు ప్రధాన నగరాలకు చెందిన ఆరు జట్లు ఇందులో ఉంటాయి. ఈ రసు కోసం జాతీయ.. అంతర్జాతీయ రేసర్లు పాల్గొంటున్నారు. ఈ రేసు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయటం తెలిసిందే. ఈ స్పోర్ట్ కోసం అవసరమైన ప్రత్యేక రోడ్డు కోసం యుద్ధ ప్రాతిపదికన దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో రోడ్డు వేశారు. మెగా కుటుంబం రంగంలోకి దిగితే ఏర్పాట్లు ఆ మాత్రం లేకుండా ఉంటాయా చెప్పండి.
ఇంత భారీగా.. యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది ఎవరు? అన్నప్పుడు కనిపించే.. వినిపించే పేర్లు వేరుగా ఉంటాయి.కానీ.. కాస్తంత లోతుగా వెళ్లినప్పుడే అసలు విషయం బోధ పడుతుంది. ఇంత హడావుడిగా ఈ క్రీడా కార్యక్రమం వెనుక ఉన్నది తెలుగు రాష్ట్రాల్లో వ్యాపార దిగ్గజంగా పేరు సొంతం చేసుకున్న మెగా క్రిష్ణారెడ్డి కుమారుడని చెబుతున్నారు. ఆయన ప్రత్యేకంగా దీన్ని తీసుకోవటంతో ప్రభుత్వం పరుగులు తీస్తూ.. క్రీడా కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు జరిగాయని చెబుతున్నారు. అందుకే అనేది మెగా అంటే మాటలు కాదని!