Begin typing your search above and press return to search.

వైసీపీ, టీడీపీ... ర‌చ్చ రంబోలా చేసేశారు

By:  Tupaki Desk   |   4 Oct 2016 3:25 PM IST
వైసీపీ, టీడీపీ... ర‌చ్చ రంబోలా చేసేశారు
X
నూజివీడు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌ చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావులు ఒకరికపై ఇంకొకరు అవినీతి అరోపణలు - సవాళ్లు - ప్రతి సవాళ్ళు చేసుకుంటూ చివరకు బహిరంగ చర్చకు సిద్ధం అయిన తీరు తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది. తాజా, మాజీ ఎమ్మెల్యేల‌కు ఇరు పార్టీలకు చెందిన నాయకులు - కార్యకర్తలు నేతలకు వెన్నుదన్నుగా ఉండి, బహిరంగ చర్చకు సిద్దం అవటంతో నూజివీడులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆఖ‌రికి పోలీసులు రంగ ప్రవేశం చేసి నేతలను నేత‌ల‌ను గృహ నిర్భంధంలో ఉంచడంతో ప‌రిస్థితి ఒకింత అదుపులోకి వ‌చ్చింది.

నూజివీడు అభివృద్ధి-రాజకీయ నేతల అవినీతి పాలనపై మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు - నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావులు సవాళ్లు - ప్రతి సవాళ్ళు విసురుకున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో బహిరంగ చర్చకు రావాలని ఒకరి నొకరు సవాల్ చేసుకున్నారు. చివరకు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు స్థానిక రోడ్లు - భవనాల శాఖ అతిధిగృహంలో బహిరంగ చర్చ నిర్వహించేందుకు ఇరువురు నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నూజివీడు డీఎస్‌ పీ శ్రీనివాసరావు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు - మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తో నేరుగా మాట్లాడారు. బహిరంగ చర్చకు వస్తే శాంతి భద్రతలకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని చెప్పారు. అయినప్పటికీ వీరు వినకపోవటంతో పోలీసులు అధికారులను పంపి గృహ నిర్బంధం చేయించారు. ఇరు పార్టీ కార్యాలయాల వద్ద జన సమీకరణ జరిగింది. రాజకీయ డ్రామాలతో కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతాప్ - ముద్దరబోయినలను తీసుకువెళ్ళేందుకు వారి అనుచరులు ప్రయత్నించటం, పోలీసులు అడ్డుకోవటం జరిగింది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలీసుల నిర్భంధంలో నేతలు ఉండటంతో బహిరంగ చర్చ వాయిదా పడినట్లు ఇరువురు నాయకులు బహిరంగంగా ప్రకటించారు.

బహిరంగ చర్చకు ఎట్టిపరిస్థితుల్లో వెనుకాడేది లేదని త‌న‌పై అవినీతి అరోపణలు చేసిన ముద్దరబోయిన వాటిని రుజులు చేయాలని ప్రతాప్ డిమాండ్ చేశారు. అధికార పార్టీ కాబ‌ట్టి ఏం చేసినా చెల్లుతుంద‌నే తీరును మానుకోవాల‌ని కోరారు. అభివృద్ధి - అవినీతిపై బహిరంగ విచారణలో నిజాలు నిగ్గు తేల్చేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు చెప్పారు. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ నీతి వంతమైన పాలన అందించానని అన్నారు. ఎక్కడ చర్చ పెట్టినా వచ్చి నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని, వేదికను ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు సిద్ధం చేయాలని సవాల్ విసిరారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/