Begin typing your search above and press return to search.
శనివారం రాత్రి టీఆర్ఎస్ హెడ్ క్వార్టర్స్ నుంచి వారికి ఆ మెసేజ్ లు
By: Tupaki Desk | 2 Oct 2022 3:31 AM GMTఅధికారికంగా ఒక్క మాట అంటే ఒక్క మాట రానప్పటికీ.. దసరా పండుగ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించనున్న జాతీయ పార్టీకి సంబంధించిన అంశాలు మాత్రం పెద్ద ఎత్తున మీడియాను పలుకరిస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలోనూ భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు తెలంగాణ కోసం కోట్లాడిన కేసీఆర్ ఇప్పుడు దేశంలో జరగాల్సిన రాజకీయ మార్పు గురించి ఆయన ఫైట్ చేసేందుకు తెర వెనుక పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
కేసీఆర్ ప్రారంభించనున్న జాతీయ పార్టీకి సంబంధించిన కసరత్తు.. ఏర్పాట్లు భారీగా సాగుతున్నాయి. ఓపెనింగ్ ఎంత గ్రాండ్ గా ఉంటే.. అంత మైలేజీ వస్తుందన్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు నడుస్తున్నాయి. దసరా రోజున (అక్టోబరు 5న) మధ్యాహ్నం జాతీయ పార్టీ ప్రకటన వెలువడుతుందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రత్యేక మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్న వైనం మూడు రోజుల క్రితమే ప్రకటించారు.
మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. అందులో జాతీయ పార్టీ ప్రకటన చేస్తారన్న అంచనాలకు భిన్నంగా.. దాన్ని మరింత గ్రాండ్ గా నిర్వహించేందుకు వీలుగా మరో కొత్త కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రెస్ మీట్ కు ముందు పార్టీ కార్యాలయంలో పార్టీ సన్నాహక సమావేశాన్ని నిర్వహించేందుకు వీలుగా ఒక ప్రోగ్రాంను డిజైన్ చేశారు.
అందులో భాగంగా శనివారం రాత్రి టీఆర్ఎస్ హెడ్ క్వార్టర్ అయిన తెలంగాణ భవన్ నుంచి పార్టీకి చెందిన మంత్రులు.. జిల్లా అధ్యక్షులకు ప్రత్యేక ఆహ్వానాల్ని పంపటం షురూ చేశారు. తెలంగాణ భవన్ లో ప్రత్యేక సమావేశం ఉందని.. దానికి అందరూ హాజరు కావాలన్న మెసేజ్ తో.. పార్టీకి చెందిన పలువురికి అధికారికంగా మెసేజ్ లు పంపటం చూస్తే.. ముందుగా అనుకున్న దాని కంటే భారీగా పార్టీ ప్రకటన ఉండేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది?