Begin typing your search above and press return to search.
ఆ ధనుంజయరెడ్డి పోయి.. మళ్లీ ఈ ధనుంజయరెడ్డి వచ్చె!
By: Tupaki Desk | 8 Feb 2023 7:11 PM ISTఏపీలో వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించాలని ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పెద్ద లక్ష్యమే పెట్టుకున్నారు. ఈ దిశగా ఇప్పటికే వైసీపీ నేతలకు ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అయితే వైసీపీలో పరిణామాలు రోజురోజుకీ ఆ పార్టీలో ఆందోళన నింపుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.
కొద్ది రోజుల క్రితం నెల్లూరు జిల్లా వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంపై వీరిద్దరూ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఆ పార్టీ అధిష్టానం వారు ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల ఇంచార్జిలుగా వీరిని తొలగించి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డిలను నియమించింది.
అయితే ఇంతటితో నెల్లూరు కలకలానికి పుల్ స్టాప్ పడలేదు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి తన నియోజకవర్గంలో వైసీపీ అధిష్టానం పరిశీలకుడిగా ధనుంజయరెడ్డిని నియమించడాన్ని తప్పుబడుతూ మీడియాకు ఎక్కారు.
ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉదంతాలను ఇంకా వేడి మీద ఉండగానే నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి కలకలం రేపారు. తన నియోజకవర్గంలో ధనుంజయరెడ్డి అనే పరిశీలకుడి పెత్తనం ఎక్కువ అయ్యిందని మండిపడ్డారు. ఆయనను తొలగించాలని జిల్లా మంత్రికి, సీఎం జగన్ కు ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి తెలిపారు. టీడీపీకి చెందిన ధనుంజయరెడ్డిని పరిశీలకుడిగా నియమించడం ఏమిటని నిలదీశారు. తన నియోజకవర్గంలో టీడీపీ వ్యక్తిని పరిశీలకుడిగా నియమించడంపై మండిపడ్డారు.
దీంతో కంచుకోట లాంటి నెల్లూరు జిల్లాలో సీఎం సొంత సామాజికవర్గం నేతల నుంచే అసంతృప్తి ఎదురవ్వడంతో వైసీపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి కోరిక మేరకు ధనుంజయరెడ్డిని నియోజకవర్గ పరిశీలకుడిగా తొలగించింది. అయితే ఆయన స్థానం మరో ధనుంజయరెడ్డిని నియమించడం విశేషం. ఈ మేరకు వైసీపీ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది.
ఇప్పటివరకు ఉదయగిరి పరిశీలకుడిగా కొడవలూరు ధనుంజయరెడ్డి ఉండగా ఆయన స్థానంలో మెట్టుకూరు ధనుంజయరెడ్డిని పరిశీలకుడిగా నియమించింది. పేర్లు ఒకటే.. కానీ ఇంటి పేర్లే తేడా కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజా పరిశీలకుడి నియామకంపై మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
కాగా ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి చంద్రశేఖరరెడ్డి 2004, 2009, 2012 (ఉప ఎన్నిక), 2019లో ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొత్తం నాలుగుసార్లు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో టీడీపీ అభ్యర్థి బొల్లినేని రామారావు చేతిలో ఓడిపోయారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.