Begin typing your search above and press return to search.
నేను ఫోన్ చేసినా తీయవా? ఏపీ మంత్రి ఆగ్రహం
By: Tupaki Desk | 26 Aug 2020 4:00 AM GMTనెల్లూరు జీజీహెచ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ నిర్లక్ష్యంపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు. ప్రభుత్వ నిధులు ఇస్తున్నా.. సౌకర్యాలు కల్పిస్తున్నా కరోనా రోగుల పట్ల ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నావంటూ మంత్రి అనిల్ కుమార్ అందరిముందే కడిగేశాడు.
నెల్లూరులోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కరోనాపై సమీక్షా సమావేశాన్ని మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డిపై మంత్రి అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను ఫోన్ చేస్తే తీయవని..కోవూరు ఎమ్మెల్యే నాలుగు సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవని.. నీ వల్ల మేము మాటలుపడుతున్నామని మంత్రి అనిల్ కుమార్ జీజీహెచ్ సూపరింటెండెంట్ ను నిలదీశారు. కరోనాతో ఇబ్బందులు పడుతున్నారని.. ఐసీయూను ఎందుకు సరిచేయడం లేదని ఫైర్ అయ్యారు.
ఇక కరోనా పాజిటివ్ వ్యక్తులను ప్రాథమిక దశలోనే గుర్తించి మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడాలని మంత్రి సూచించారు. మరణాల సంఖ్య పెరుగుతోందని కట్టడి చేయాలని మంత్రి సూచించారు.