Begin typing your search above and press return to search.
సత్య నాదేళ్ల పై చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన మంత్రి!
By: Tupaki Desk | 30 Jun 2023 4:34 PM GMTవైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు చేసే విమర్శలపై తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యే మంత్రుల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఒకరు. వైసీపీ మేనిఫెస్టోపై ఈ మధ్య టీడీపీ నేతలు విడుదల చేసిన పుస్తకాలు, చేసిన విమర్శలు, బిందు సేధ్యంపై లోకేష్ కామెంట్లు, సత్యనాదెళ్ల విషయంలో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపైనా మంత్రి తాజాగా మైకులముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆధారాలు చూపిస్తూ చంద్రబాబు పై ఫైరయ్యారు.
అవును... మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్యనాదెళ్ల ఎదగడానికి హైదరాబాద్ లో టీడీపీ ప్రభుత్వ హయాంలో స్థాపించిన మైక్రోసాఫ్టే కారణమని చంద్రబాబు అసత్యాలు చెప్పారని మొదలుపెట్టిన కాకాణి... బాబు జీవితమంతా అబద్ధాలమయమేనని ఎవరు సక్సెస్ అయినా ఆ క్రెడిట్ తనదేనని చంద్రబాబు ప్రచారం చేసుకుంటారని ఎద్దేవా చేసారు. ఈ సందర్భంగా సత్యనాదెళ్ల కెరీర్ ఎలా మొదలైంది అనే విషయాలపై ఆయన ఆధారాలు చూపించారు.
సత్య నాదెళ్ల 1984-88 మధ్య బెంగళూరులో ఇంజినీరింగ్ పూర్తిచేశారని, 1988లో ఇంజినీరింగ్ పూర్తయిన తరువాత అమెరికా వెళ్లారని గుర్తు చేసిన మంత్రి కాకాణి... 1990 నాటికి మాస్టర్ డిగ్రీ పూర్తిచేసి, అనంతరం సన్ మైక్రో సిస్టంస్ లో చేరారని వివరించారు. ఈ క్రమంలో 1992లో సన్ మైక్రో సిస్టమ్ నుంచి మైక్రోసాఫ్ట్ కు మారారని స్పష్టం చేశారు.
ఇలా సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్ లో చేరేనాటికి చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేదని తెలిపిన ఆయన... 1992లోనే మైక్రోసాఫ్ట్ చేరిన సత్యనాదెళ్ల... 2004లో హైదరాబాద్ లో ప్రారంభమైన మైక్రోసాఫ్ట్ లో పనిచేయడం వల్ల ఆ సంస్థకు సీఈవోగా ఎదగారంటూ అసత్యాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఇదే సమయంలో దేశంలో జాతీయ రహదారులు వేసే విషయం కూడా తానే మాజీ ప్రధాని వాజ్ పేయ్ కు చెప్పానని కూడా చెప్పుకుంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా... పిల్లలకు ఇంగ్లిష్ నేర్పించడం తప్పు అన్నట్టుగా మాట్లాడే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయారని వ్యాఖ్యానించిన ఆయన... చంద్రబాబు మాట్లాడే "బ్రీఫ్డ్ మీ" ఇంగ్లిష్ కు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలు వస్తాయా అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా మేనిఫెస్టోలపై స్పందించిన కాకాణి... తెలుగుదేశం పార్టీ మాదిరిగా వైసీపీ మేనిఫెస్టోను దాచలేదని, ఇంటర్నెట్ నుంచి తొలగించనూ లేదని... ఆ మేనిఫెస్టోను చేతిలో పట్టుకుని పార్టీల కతీతంగా ప్రతీ ఇంటికీ వెళ్లి ఆ పథకాలు అందాయో లేదో ఆరాతీస్తున్నామని అన్నారు.
ఇదే క్రమంలో... 650 వాగ్దానాలు ఇచ్చి 10 శాతం కూడా అమలు చేయలేని వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. వీటిపై ఏమైనా సందేహం ఉంటే... కుప్పం లేదా టెక్కలి కి వెళ్లి టీడీపీ, వైసీపీల మేనిఫెస్టోల్లో ఏది అమలైందో కనుక్కుందామని మంత్రి అన్నారు.
ఇదే సమయంలో బిందు సేద్యంపై తన తనపాదయాత్రలో లోకేశ్ చేసిన ఆరోపణలపైనా మంత్రి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. బిందు సేద్యంకు చంద్రబాబు దిగిపోయే సమయానికి రూ.800 కోట్ల బకాయిలను పెడితే ఆ బకాయిలతో పాటు మరో రూ.1250 కోట్లు కలిపి... మొత్తం రూ.2వేల కోట్లను వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు.
ఇదే సమయంలో బిందు సేద్యం అమలుకు సంబంధించి రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు కేంద్రం అవార్డులు ఇచ్చిందని మంత్రి కాకాని గోవర్ధన్ గుర్తుచేశారు. ఈ సందర్భంగా... తాను ఇప్పుడు చెప్పిన అంశాలపై చంద్రబాబు, అచ్చెన్నాయుడు, లోకేష్ లు చర్చలు వస్తారా అని ఛాలెంజ్ చేశారు.