Begin typing your search above and press return to search.
అవినీతి కంపు...కంపుట...సొంత సర్కార్ మీదేనా...?
By: Tupaki Desk | 19 April 2022 2:30 AM GMTఅవినీతి కంపు కొడుతోంది అని విపక్షాలు సర్కార్ మీద విమర్శలు చేయడం సర్వ సాధారణం. ఎందుకంటే అది వారి బాధ్యత. వారు అంతా బాగున్నా ఎక్కడో రంధ్రాన్వేషణ చేసి మరీ విమర్శలు చేస్తారు. కానీ అధికార పార్టీకి చెందిన వారు, అందునా మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న వారు కొన్ని శాఖలలో అవినీతి కంపు కొడుతోంది అని చెప్పడం అంటే ఆలోచించాల్సిందే కదా. దాదాపుగా మూడేళ్ళుగా సాగిన జగన్ తొలి క్యాబినెట్ లో అవినీతి మరక ఒక్కటీ లేదని ఇప్పటిదాకా అంతా గొప్పగా చెప్పుకున్నారు.
కానీ కొత్త మంత్రులు వచ్చీ రావడంతో తమ శాఖల మీద తామే కామెంట్స్ చేస్తున్నారు. అది కూడా తెలియకుండానే తమ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నామన్న సంగతిని గుర్తుంచుకుంటున్నారో లేదో కానీ అవినీతి మా శాఖలో జరిగింది అంటే మా శాఖలో జరిగింది అని హాట్ కామెంట్స్ చేస్తున్నారు.
నిన్నటికి నిన్న రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు రెవిన్యూ శాఖలో అవినీతి బాగా జరిగింది అని నిండు సభలో ప్రకటించి సంచలనం రేపారు. దానికి అందరూ సిగ్గుపడాలని కూడా ఆయన ఘాటైన వ్యాఖ్యలే చేశారు. ఇపుడు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వంతు వచ్చినట్లుగా ఉంది.ఆయనేమంటున్నారు అంటే దేవాదాయ శాఖలో అవినీతి జరగడం వాస్తవమే అంటూ కొత్త సంచలనానికి తెర తీశారు.
తాను మంత్రిగా అవినీతి జరగకుండా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పుకొచ్చారు. అవినీతిని నిర్మూలిస్తామని భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అదంతా సరే కానీ కొట్టు సత్యనారాయణకు ముందు మంత్రిగా దేవాదాయ శాఖకు ఉన్నది వెల్లంపల్లి శ్రీనివాసరావు. ఆయన టీడీపీ మంత్రి కాదు వైసీపీ మినిష్టర్. అంటే సొంత ప్రభుత్వంలో అవినీతి జరిగింది అని కొత్త మంత్రి చెప్పదలచుకున్నారా అన్నదే చర్చగా ఉంది.
ఇక ధర్మాన ప్రసాదరావు కామెంట్స్ కూడా మాజీ మంత్రి క్రిష్ణ దాస్ నొచ్చుకునేలా ఉన్నాయని ఇప్పటికే అంటున్నారు. టోటల్ గా ఆ మంత్రులు మాజీలు అయినా ఈ రొజుకీ వారు అధికార పార్టీ ఎమ్మెల్యేలే. పైగా ఏపీలో పవర్ లో ఉన్నది వైసీపీ సర్కార్. మరి అవినీతి కంపు కొడుతోంది అని అంటున్న మంత్రులు నాడు పెదవి ఎందుకు విప్పలేదు అన్నది ప్రశ్న.
ఇక అవినీతి రహిత సర్కార్ అని వైసీపీ నేతలు ఇప్పటిదాకా ఏ విధంగా చెప్పుకుంటున్నారు అన్నది మరో ప్రశ్న. మొత్తానికి విపక్షాల కంటే కూడా తామే మించిపోయి కొత్త మంత్రులు చేస్తున్న ప్రకటనలు టోటల్ గా వైసీపీ సర్కార్ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నాయా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి మరి.