Begin typing your search above and press return to search.
కార్పొరేటర్ పై రేప్.. చిక్కుల్లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే
By: Tupaki Desk | 29 Feb 2020 7:30 PM GMTతనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తనతో గడిపిన అనంతరం పట్టించుకోవడం లేదని ఓ మహిళ కార్పొరేటర్ బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముంబై లో ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన నరేంద్ర మెహతా తాజా మాజీ ఎమ్మెల్యే 2019 ఎన్నికల్లో ఓడి పోయాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని మున్సిపల్ మహిళా కార్పొరేటర్ మీరా రోడ్డు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
అయితే మాజీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాతో ఆమె కలిసి ఉన్న అభ్యంతరకర ప్రైవేట్ ఫొటోలు బహిర్గతమయ్యాయి. కొన్ని సోషల్ లో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఫిర్యాదుతో నరేంద్ర మెహతా పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఆమె ఫిర్యాదుతో నరేంద్ర మెహతా పరారీ లో ఉన్నాడు. ఈ ఆరోపణల నేపథ్యం లో అతడో ఎక్కడో తలదాడుచుకున్నాడు. ఆయన ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు మొదలు పెట్టాయి.