Begin typing your search above and press return to search.

ఆ ఫ్యామిలీని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అంతలా వేధిస్తున్నారట!?

By:  Tupaki Desk   |   25 Sep 2020 7:30 AM GMT
ఆ ఫ్యామిలీని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అంతలా వేధిస్తున్నారట!?
X
తెలంగాణ అధికారపక్షానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు వివాదంలో చిక్కుకున్నారు. తమ కుటుంబాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేధింపులకు గురి చేస్తున్నట్లుగా ఒక మహిళ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయటం కలకలాన్ని రేపింది. ఇంతకూ ఆమె వాదన ఏమంటే..

మిర్యాలగూడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు తమ కుటుంబాన్ని వేధిస్తున్నట్లుగా మణెమ్మ అనే మహిళ కంప్లైంట్ చేశారు. మిర్యాలగూడలో కొందరు భూకబ్జాదారులు చెలరేగిపోతున్నట్లుగా ఆమె చెప్పారు. వారికి ఎమ్మెల్యే వత్తాసు పలుకుతున్నారన్నారు. తన భర్త లాయర్ గా పని చేస్తుంటారని.. ఎమ్మెల్యే బాధితుల తరఫున కేసులు వాదిస్తుండటంతో కక్ష కట్టినట్లుగా పేర్కొన్నారు.

తన భర్తపై అక్రమ కేసులు పెడుతున్నారని.. ఎమ్మెల్యే అక్రమాలను ప్రశ్నించటంతో తన భర్తను.. కొడుకును.. ఇతర కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లుగా ఆరోపించారు. ఎమ్మెల్యే నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని మానవ హక్కుల సంఘాన్ని ఆమె కోరారు. అయితే.. ఈ ఆరోపణల్ని ఎమ్మెల్యే భాస్కరరావు ఖండించినట్లుగా చెబుతుననారు. రాజకీయ ప్రత్యర్థులు తన మీద బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేస్తున్నారు. మరి.. అధిష్ఠానం ఈ ఇష్యూ పైన ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.