Begin typing your search above and press return to search.
నాలుగేళ్ల తర్వాత వచ్చాడు.. సెంచరీతోవణికించాడు
By: Tupaki Desk | 7 July 2023 1:55 PM GMTబజ్ బాల్ వ్యూహంతో ఆడుతున్న ఇంగ్లండ్ కు యాషెస్ టెస్టులో మూతి పగులుతోంది. వరుసగా రెండు టెస్టుల్లో ఓటమి పాలై ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అసలే 22 ఏళ్లుగా సొంతగడ్డ పై యాషెస్ ను కోల్పోని చరిత్ర. ఈసారి గనుక సిరీస్ ఓడితే పరువు పోవడం ఖాయం.
రెండేళ్ల కిందట ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ లో ఇంగ్లండ్ దారుణ ప్రదర్శన చేసింది. ఐదు టెస్టుల సిరీస్ ను 0-4తో కోల్పోయింది. ఆ దెబ్బకు జో రూట్ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఇప్పుడు మేటి ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ రూపంలో ఇంగ్లండ్ మంచి సారథి దొరికాడు. కానీ, బజ్ బాల్ అంటూ దూకుడుగా ఆడుతూ ఓటమిని కొనితెచ్చుకుంటోంది.
మూడో టెస్టు తొలి రోజే రంజుగా యాషెస్ మూడో టెస్టు గురువారం హెడింగ్లే మొదలైంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ ఓపెనర్లు వార్నర్ (4), ఖవాజా (13) వికెట్లను త్వరగానే కోల్పోయింది. వన్ డౌన్ లబుషేన్ (21), మాజీ కెప్టెన్ స్మిత్ (22) ఎక్కువసేపు నిలవలేదు. లంచ్ విరామానికి ఆసీస్ స్కోరు 91/4. అయితే, అప్పుడే మొదలైంది తుపాను.
నాలుగేళ్లకు వచ్చినా..ప్రపంచ క్రికెట్ లో ప్రస్తుతం పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్లు అంటే కామెరూన్ గ్రీన్, బెన్ స్టోక్స్, హార్దిక్ పాండ్యా, జాసన్ హోల్డర్ తదితరులు గుర్తొస్తారు. కానీ, అందరూ మరిచిపోయిన ఓ పేరు మిచెల్ మార్ష్. యాషెస్ మూడో టెస్టు లో అతడు 118 బంతుల్లో 118 పరుగులు చేశాడు. ఇందులో 17 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. ఆసీస్ చేసిన 263 పరుగుల్లో 118 మార్ష్ వే.
అతడి మెరుపు సెంచరీ లేకుంటే ఇంకా తక్కువ స్కోరుకే పరిమితం అయ్యేది. 85కే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను మార్ష్ అద్భుత ఇన్నింగ్స్ తో ఆదుకున్నాడు. ఇంగ్లండ్ కు మార్ష్ ఇచ్చిన షాక్ మామూలుది కాదు. లంచ్ విరామం తర్వాత దాడికి దిగి ఎడాపెడా బౌండరీలు బాదాడు.
అతడి గాయం..వాస్తవానికి మిచెల్ సెప్టెంబరు 2019లో చివరి టెస్టు ఆడాడు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ నిన్ననే బరిలో దిగాడు. ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ కు గాయం కావడంతో మార్ష్ కు అవకాశం దక్కింది. అద్భుత ప్రతిభావంతుడైన మిచెల్ స్థానాన్ని గ్రీన్ భర్తీ చేస్తున్నాడు.
అయితే, మార్ష్ కు గాయాల బెడద ఎక్కువ. వరుసగా రెండు సిరీస్ లు ఆడడం అంటే కష్టమే అన్నట్లుంటుంది. పరిస్థితి. కానీ, ఈసారి నాలుగేళ్ల తర్వాత బరిలో దిగినా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 102 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. కాగా, మార్ష్.. 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన క్యాచ్ ను స్లిప్ లో రూట్ వదిలేశాడు.
దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ కుమారుడు ఆసీస్ మాజీ ఆల్ రౌండర్ షాన్ మార్ష్ సోదరుడు, మేటి క్రికెటర్-వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జెఫ్ మార్ష కుమారుడు మిచెల్ మార్ష్. 32 ఏళ్ల మిచెల్ 12 ఏళ్ల కిందటనే ఆస్ట్రేలియాకు వన్డేలు, టెస్టులు ఆడాడు. 2014లోనే టెస్టు జట్టులోకి వచ్చాడు.
ఇక షాన్ మార్ష్ 38 టెస్టులు, 73 వన్డేలు, 15 టి20లు ఆడాడు. తండ్రి జెఫ్ మార్ష్ 50 టెస్టులు, 117 వన్డేల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. అంటే తండ్రీ, ఇద్దరు కుమారులూ టెస్టుల్లో దేశానికి ఆడడం అంటే ప్రత్యేకమే.