Begin typing your search above and press return to search.

పీకే ఆఫీసుకు వెళ్లిన స్టాలిన్.. ఎవరితో వెళ్లారంటే?

By:  Tupaki Desk   |   9 April 2021 6:00 AM GMT
పీకే ఆఫీసుకు వెళ్లిన స్టాలిన్.. ఎవరితో వెళ్లారంటే?
X
ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ పశ్చిమ బెంగాల్ లో తప్పించి మిగిలిన చోట్ల పూర్తి అయినట్లే. మరికొన్ని విడతల్లో బెంగాల్ లోనూ పూర్తి కానుంది. ఎన్నికల ఫలితాలు మే 2న విడుదల కానున్నాయి. ఫలితాల విషయంలో అందరి చూపు రెండు రాష్ట్రాల మీదనే ఉన్నాయి. మొదట పశ్చిమబెంగాల్ ఉంటే.. తర్వాతి ఆసక్తి తమిళనాడు మీదనే ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) కీలక భూమిక పోషించారు.

పశ్చిమబెంగాల్ లో అధికార పార్టీ తరఫున పని చేస్తే.. తమిళనాడులో మాత్రం విపక్ష డీఎంకేకు తన సేవల్ని అందించారు. తాజాగా పీకే కార్యాలయమైన ఐప్యాక్ కు డీఎంకే అధినేత స్టాలిన్ వెళ్లారు. అక్కడి వారికి అభివాదం చేశారు. పలువురు ఆయనతో సెల్పీలు దిగేందుకు పోటీ పడ్డారు. కాబోయే సీఎం అంటూ సందడి చేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానన్న ధీమా స్టాలిన్ లో కనిపించింది.

పీకే ఆఫీసుకు వెళ్లే వేళలో తనతో పాటు తన అల్లుడు శబరీషన్ తో కలిసి వెళ్లటం గమనార్హం. వాస్తవానికి పీకేతో డీల్ కుదిర్చే విషయంలో శబరీష్ కీలకంగా వ్యవహరించినట్లు చెబుతారు. అందుకే.. పీకేను కలిసేందుకు వెళ్లే వేళలో తన వెంట తన అల్లుడ్ని స్టాలిన్ ను తీసుకెళ్లారు. ఈ ఎన్నికల్లో స్టాలిన్ కుమారుడు కీలక భూమిక పోషించినప్పటికి.. పీకే కార్యాలయానికి మాత్రం అల్లుడితో వెళ్లారు.

ఇదిలా ఉంటే.. స్టాలిన్ కు ఎంతో కీలకమైన ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్తగా సేవలు అందించేందుకు ప్రశాంత్ తో డీల్ కుదిర్చే విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం సహాయం చేశారని చెబుతారు. స్టాలిన్ కు జగన్ సన్నిహిత స్నేహితుడన్న విషయం తెలిసిందే. స్టాలిన్ ప్రమాణ స్వీకారానికి జగన్ తప్పనిసరిగా హాజరవుతారని చెబుతున్నారు. పీకే ఆఫీసుకు వెళ్లిన స్టాలిన్ ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే వెలువడిన అంచనాలన్నీ స్టాలిన్ ను తమిళనాడుకు కాబోయే సీఎం అన్న మాటనే చెబుతున్నాయి.