Begin typing your search above and press return to search.

కోళ్ల బిజినెస్ స్టార్ చేయనున్న మిస్టర్ కూల్ ' ఎం ఎస్ ధోని '

By:  Tupaki Desk   |   14 Nov 2020 12:30 AM GMT
కోళ్ల బిజినెస్ స్టార్ చేయనున్న మిస్టర్ కూల్  ఎం ఎస్ ధోని
X
కడక్‌ నాథ్ ..ఇప్పుడు ఈ జాతి కోళ్ల పేరు మార్మోగిపోతుంది. అత్యధిక పోషక విలువులతో పాటు వీటి మాంసం చాలా రుచిగా ఉంటుందని టాక్ నడుస్తోంది. మన తెలుగు రాస్ట్రాల్లో వీటి గురించి అంతగా తెలియదు కానీ, నార్త్‌తో పాటు ఈనాశ్య రాష్ట్రాల ప్రజలు ఈ మాంసం బాగానే తింటున్నారు. ఇక ఎం ఎస్ ధోని .. క్రికెట్ గురించి తెలిసిన ఏ ఒక్కరిని అడిగినా ఈ పేరు తెలుసనే అంటారు. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అనంత‌రం ధోనీ ఈ మ‌ధ్యే ఐపీఎల్‌ లో క‌నిపించాడు. ఇక మళ్లీ ఐపీఎల్ వరకు సమయం ఉండటం తో ధోనీ బిజినెస్‌ల వైపు దృష్టి సారించాడు. ఈ క్ర‌మంలోనే క‌డ‌క్‌నాథ్ కోళ్ల‌ను పెంచాల‌ని ధోనీ నిర్ణ‌యించుకున్నాడు.

ధోనీ బృందం.. దాదాపు 2000 కోళ్లను ఇప్పటికే ఆర్డర్ పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలో కడక్ నాథ్ కోళ్ల ఫామ్ ను స్వస్థలం రాంచీలో ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నాడట. మధ్యప్రదేశ్ జబువా జిల్లాకు చెందిన ఓ పౌల్ట్రీ యజమానితో ధోనీ బృందం ఇప్పటికే సంప్రదింపులు జరిపారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చారని తెలుస్తుంది. మధ్యప్రదేశ్ లోని జబువా జిల్లాలో లభించే ఈ కడక్ నాథ్ కోళ్లకు 2018లోనే జీఐ ట్యాగ్ కూడా దక్కింది. వీటినే పెరటికోళ్లు అని కూడా అంటారు. డిసెంబ‌ర్ 15వ తేదీ వ‌ర‌కు ఆ కోడిపిల్ల‌లు కావాల‌ని ధోనీ ఆ రైతుకు చెప్పాడు. దీంతో ఆ స‌మ‌యంలోగా ఆ కోడిపిల్ల‌ల‌ను ఆ రైతు ధోనీకి పంప‌నున్నాడు.

సాధార‌ణ కోళ్ల‌లో ఫ్యాట్ 25 శాతం ఉంటే క‌డ‌క్‌నాథ్ కోళ్ల‌లో 1.94 శాతం మాత్ర‌మే కొవ్వు ఉంటుంది. కొలెస్ట్రాల్ సాధార‌ణ కోళ్ల‌లో 218 మిల్లీగ్రాములు ఉంటే క‌డ‌క్‌నాథ్ కోళ్ల‌లో 59 మిల్లీగ్రాములు మాత్ర‌మే ఉంటుంది. అలాగే ఇత‌ర కోళ్ల క‌న్నా క‌డ‌క్‌నాథ్ కోళ్ల‌లోనే ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి. అందుక‌నే ఈ కోళ్లకు ప్ర‌స్తుతం డిమాండ్ బాగా పెరిగింది. గ్రామాల్లో చిన్న సన్నకారు రైతులతో పాటు భూమిలేని వ్యవసాయ కూలీలు పెరటి కోళ్ల పెంపకాన్ని చేపట్టి లాభాలు ఆర్జిస్తున్నారు. సమతుల్యమైన ఆహారంతో పాటు ఆదాయం పొందుతున్నారు.