Begin typing your search above and press return to search.
నందమూరి ముద్ర ఏదీ : బాలయ్య....చిన్నమ్మలకు చిక్కులు...?
By: Tupaki Desk | 19 Sep 2022 2:30 AM GMTఎన్టీయార్ వెండి తెర కధానాయకుడు. ఆయన మూడున్నర దశాబ్దాల పాటు రాజకీయాలను శాసించారు. ఆ మీదట రాజకీయాల్లోకి వచ్చి తొమ్మిది నెలల వ్యవధిలోనే పార్టీ పెట్టి సీఎం అయ్యారు. ఎన్టీయార్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన సీఎం గానే కాదు, జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ రాణించారు.
మరి ఆయన సినీ వారసులు అయితే ఉన్నారు. కానీ రాజకీయ వారసులు ఎవరు అంటే జవాబు లేదు. ఎన్టీయార్ అల్లుడు చంద్రబాబు టీడీపీని తన సొంతం చేసుకుని నారా వారి పార్టీగా మార్చుకున్నారు. చంద్రబాబు తరువాత వారసుడిగా అక్కడ ఆయన కుమారుడు లోకేష్ సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశంలో చంద్రబాబు జాతీయ ప్రెసిడెంట్ అయితే జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ నియమితులయ్యారు. మొత్తానికి టీడీపీలో నందమూరి వారి వారసులు అయితే పెద్దగా కనిపించే సీన్ లేదు.
అప్పట్లో హరిక్రిష్ణ చంద్రబాబు వెంట ఉండి మంత్రిగా కొన్ని నెలల పాటు పనిచేశారు. ఆ తరువాత ఆయనకు తిరిగి మంత్రి పదవి అప్పగించలేదు. 2008లో రాజ్యసభ సభ్యునిగా హరిక్రిష్ణను చేసినా 2009 ఎన్నికలలో జూనియర్ ఎన్టీయార్ అవసరాలను దృష్టిలో పెట్టుకునే. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడింది. అలా జూనియర్ ని కూడా సైడ్ చేశారు. హరిక్రిష్ణ కూడా ఎంపీ పదవికి ఉమ్మడి ఏపీ విభజనకు వ్యతిరేకంగా రాజీనామా చేశారు. అలా హరి రాజకీయం టీడీపీలో పూర్తిగా ముగిసింది.
ఆయన తమ్ముడు సినీ నటుడు బాలక్రిష్ణ 2014లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి హిందూపురం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయన మంత్రి అవుతారని కూడా భావించినా అది జరాలేదు. 2019లో బాలయ్య రెండవమారు గెలిచినా కూడా టీడీపీ అధికారంలోకి రాలేకపోయింది. టీడీపీలో బాలయ్య అందరిలో ఒకరిగా పొలిట్ బ్యూరో మెంబర్ గా ఉంటున్నారు అంతే.
ఇక కుమార్తెలలో దగ్గుబాటి పురందేశ్వరి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. ఆమె తొలిసారి బాపట్ల నుంచి రెండవసారి విశాఖ నుంచి ఎంపీగా గెలిచారు. ఆమె కేంద్రంలో సహాయ మంత్రిగా అలాగే ఇండిపెండెంట్ చార్జితో కూడా పనిచేసి మెప్పు పొందారు. అన్న గారికి అసలైన వారసురాలిగా ఆమె నిలిచారు అనిపించుకున్నారు. అయితే ఏపీ విభజన వల్ల ఆమె రాజకీయం తారు మారు అయింది. దాంతో ఆమె బీజేపీలో చేరారు.
అయితే బీజేపీలో చూస్తే ఇపుడు పురందేశ్వరికి పెద్దగా ప్రాముఖ్యత ఉండడం లేదు అన్న ప్రచారం సాగుతోంది. ఆమెకు రాజ్యసభ ఇస్తారనుకున్నా ఇవ్వలేదు. దాంతో పార్టీలోనూ కీలకమైన స్థానంలో ఆమె లేకుండా పోతున్నారు. ఈ నేపధ్యంలో ఏపీలో బీజేపీ నాయకులు నిర్వహించే ఏ కార్యక్రమంలో ఆమె పెద్దగా కనిపించడంలేదు దీంతో అన్న గారి తనయ రాజకీయం కూడా ఇపుడు డైలామాలో పడింది.
ఆమె టీడీపీలో చేరి ఎంపీగా పోటీ చేస్తారు అని ప్రచారం అయితే సాగుతోంది. అయితే చంద్రబాబు ఈ విషయంలో ప్రస్తుతానికి సానుకూలంగా ఉన్నా టీడీపీలో అన్న గారి వారసులకు ఎంతమేరకు రాజకీయ అవకాశాలు ఉంటాయన్నది హరిక్రిష్ణ, బాలక్రిష్ణ ఉదాహరణలు బట్టి తెలిసిపోతోంది. దాంతో ఎన్టీయార్ వంటి మేరు నగధీరుడు రాజకీయాల్లో తనకంటూ సమ్మున్నత స్థానం సంపాదించుకున్న ధీరుడు అయిన అన్న గారి వారసులు రాజకీయాల్లో గట్టిగా ఉనికిని చాటుకోలేకపోతున్నారా అన్న చర్చ అయితే గట్టిగా సాగుతోంది.
ఒక విధంగా చూస్తే బాలయ్యకు అయినా పురందేశ్వరికి అయినా 2024 ఎన్నికలే కీలకం. సీటు సంపాదించుకుని గెలిచి సత్తా చాటకపోతే మాత్రం అన్న గారి పొలిటికల్ లెగసీ కి ఇబ్బందికరమైన పరిస్థితి తప్పదన్న విశ్లేషణలు ఉన్నాయి. నిజానికి అన్న గారు పెట్టిన టీడీపీ ఇపుడు కష్టమైన పరిస్థితుల్లో ఉంది. ఈ టైం లో అయినా నందమూరి ఫ్యామిలీ ఒక్కటిగా నిలిచి అదే పార్టీలో కీలకమైన పాత్ర పోషించే ప్రయత్నం చేయాల్సి ఉంది. కానీ దానికి అవకాశాలు తామే తెచ్చుకోవాలి. తామే ముందు వరసలోకి రావాలి బహుశా ఇది బిగ్ టాస్క్ అని భావించే వారు మిన్నకుంటున్నారా అన్నది కూడా మరో చర్చగా ఉంది.