Begin typing your search above and press return to search.
ఎన్టీయార్ వారసులు వారే..!
By: Tupaki Desk | 28 May 2023 8:38 AM GMTదివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి తెలుగు వారి ఇలవేలుపు అయిన ఎంటీయార్ వంటి మహనీయుడు మళ్లీ ఈ భూమి మీద పుట్టబోడు అని ఎవరైనా కచ్చితంగా చెబుతారు. ఆయన బతికింది డెబ్బై మూడేళ్ళు. ఆయన ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారు. ఆయన నటుడుగా వెండి తెర ఉన్నంతకాలం ఉంటారు. రాజకీయాల్లో పద్నాలుగేళ్ళు మాత్రమే ఉన్నారు. అయినా సరే తెలుగు జాతి ఉన్నంతవరకూ సరిపడా కీర్తిని ఆర్జించారు.
ఎన్టీయార్ జయంతి ప్రతీ ఏటా మే 28న వస్తుంది. ఆ రోజున తెలుగుదేశం పార్టీ మహానాడు పెట్టి ఆయనకు ఘనంగా నివాళి అర్పిస్తుంది. అయితే ఎన్టీయార్ కి చంద్రబాబు వారసుడు కాడని, ఆయన ఎలా నివాళులు అర్పిస్తారు అని ఆయన రెండవ భార్య లక్ష్మీ పార్వతితో పాటు వైసీపీ నేతలు కూడా విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే ఎన్టీయార్ ఆశయాలను తామే ముందుకు తీసుకుపోతామని చంద్రబాబు చెబుతూ ఉంటారు.
ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుని దశాబ్దాలుగా వెంటాడుతోంది. ఆయన ప్రజల కోసం పార్టీని రక్షించుకున్నామని చెప్పినా ఎన్టీయార్ ని కూలదోయడం కిందనే అంతా చూస్తున్నారు. అయితే రాజకీయాల్లో ఇవన్నీ కామన్ కాబట్టి ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక తరాలు మారాయి కాబట్టి ఆ ఎపిసోడ్ ఇప్పటివారికి తెలియదు.
మొత్తానికి బతికి ఉన్నపుడు ఎన్టీయార్ ని గద్దే దించి ఒక మాజీ సీఎం కి అసెంబ్లీలో చిట్టచివరిగా తాను ఏమైనా చెప్పుకునే అవకాశాన్ని కూడా లేకుండా నాటి ఉమ్మడి ఏపీ శాసనసభ చేసింది. అనాటి సీఎం చంద్రబాబు హయాంలోనే అది జరిగింది. ఎన్టీయార్ కి వైస్రాయ్ హొటల్ వద్ద చెప్పులతో దాది జరిగింది. ఇది కూడా చరిత్ర పుటల్లో ఉంది.ఎన్టీయార్ మానసిక క్షోభతోనే మరణించారు అన్నది చరిత్ర ఎరిగిన మరో సత్యం.
ఈ నేపధ్యంలో ఎన్టీయార్ వారసుల పార్టీగా టీడీపీని జనాలు చూస్తున్నారా అంటే ఒక రాజకీయ పార్టీగానే చూస్తున్నారు. నిజానికి ఎన్టీయార్ ఓటు బ్యాంక్ అన్నది ఏనాడో టీడీపీకి షిఫ్ట్ అయింది. అది పార్టీ గుర్తు రూపంలో అలా వచ్చి కొనసాగుతోంది. ఇక కొత్త తరానికి టీడీపీ చంద్రబాబు విధానాలు మాత్రమే కావాలి కానీ ఎన్టీయార్ కి అన్యాయం చేశారా లేదా అన్నది పట్టదు.
అయినా సరే ఎన్టీయార్ జయంతిని నిర్వహించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు అని లక్ష్మీపార్వతి అంటున్నారు. అయితే రాజకీయాల్లో నైతికత అన్నది నేతి బీర కాయ వంటింది. ఈ విషయంలో చంద్రబాబుకు ఎప్పటికి ఏ రాగం అందుకోవాలో తెలిసిననంతగా మరొకరికి తెలియదు. ఇక లక్ష్మీపార్వతి విషయానికి వస్తే ఆమె ఎన్టీయార్ రెండవ సతీమణిగా కుటుంబం గుర్తించడంలేదు. ఎన్టీయార్ కి భారత రత్న ఇస్తే ఆమె తీసుకుంటారనే అది రాకుండా చేశారు అన్న విమర్శలు ఉన్నాయి.
మరో వైపు ఎన్టీయార్ సీఎం గా ఉండగా రాజ్యాంగేతర శక్తిగా ఆమె జోక్యం చేసుకున్నారని అప్పట్లో ఆరోపణలు ఉన్నాయి. ఆమె వల్లనే ఎన్టీయార్ ని దించాల్సి వచ్చిందని ఈ రోజుకీ టీడీపీ నేతలు అంటూంటారు. మాకు ఎన్టీయార్ దేవుడే కానీ ఆయనని ఆమె అలా తప్పుదోవపట్టించారు కాబట్టే అధికారం తీసుకోవడం తప్ప గత్యంతరం లేకపోయింది అని అంటారు
ఏది ఏమైనా కర్ణుడి చావులు ఆరు కారణాలు అన్నట్లుగా అన్న గారి రాజకీయ పతనానికి మరణానికి అటూ ఇటూ కుటుంబ సభ్యులు అందరూ కారకులే అన్నది తెలుగు వారి భావన. మరి ఎన్టీయార్ కి వారసులు ఎవరు అన్న ప్రశ్న వస్తుంది. ఎన్టీయార్ కి నిజమైన వారసులు ఆయన్ని నిత్యం అభిమానించే ప్రజలే.
రాజకీయాలు ఏమీ తెలియని నిష్కపటి ఎన్టీయార్ . పేదలకు న్యాయం చేయాలని తపించిన మహనీయుడు. ఆయన ఆశయాలను నెరవేర్చే రాజకీయ నాయకులు అంతా ఆయన వారసులే. అలాగే ఆయన అంటే భక్తితో అభిమానంతో ఆరాధించే వారంతా ఆయన వారసులే. ఇదే ఎప్పటికీ సత్యం. ఈ అభిమానం శాశ్వతం. దీనికి ఏ రాజకీయం మకిలీ అంటదు కూడా. అంతే కాదు అన్న గారి నిండు దీవెనలు కూడా స్వచ్చమైన అభిమానుల మీదనే ఉంటుంది.