Begin typing your search above and press return to search.

గౌరవసభలోకి అడుగుపెట్టాల్సిందే

By:  Tupaki Desk   |   3 Jun 2023 4:00 PM GMT
గౌరవసభలోకి అడుగుపెట్టాల్సిందే
X
వచ్చేఎన్నికల్లో గౌరవసభలోకి అడుగుపెట్టి తీరాల్సిందే అని చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. నియోజకవర్గాల పరిశీలకులతో చంద్రబాబు రివ్యూచేశారు. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితులు ఏమిటి ? బలమైన అభ్యర్ధులు ఎవరు ? నేతల్లో పార్టీకోసం కష్టపడుతున్నదెవరు లాంటి అనేక విషయాలను చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు వచ్చేఎన్నికల్లో తాను గౌరవసభలోకి అడుగుపెట్టాలంటే మొహామాటానికి పోతే సాధ్యంకాదన్నారు. కౌరవసభను తాను గౌరవసభగా మారుస్తానని నిండు అసెంబ్లీలో చేసిన ప్రతిజ్ఞను గుర్తుచేశారు.

రాబోయేఎన్నికల్లో పార్టీ గెలిస్తేనే కౌరవసభ గఃరవసభ అవుతుందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. టీడీపీ గెలవాలంటే ముందు గట్టి అభ్యర్ధులను, గెలుపు గుర్రాలను రంగంలోకి దింపాల్సిందే అన్నారు. మొహామాటాలకు పోయి, సీనియర్లని ఎవరిని పడితే వాళ్ళని అభ్యర్ధులుగా దింపితే పార్టీ నష్టపోవటం ఖాయమన్నారు. కాబట్టి అన్నీ కోణాల్లో పరిశీలించే తాను టికెట్లు ఖాయంచేస్తానన్నారు. టికెట్లు రానీ సీనియర్లు ఏమీ అనుకోవద్దని చెప్పేశారు.

ప్రతి నియోజకవర్గానికి సంబంధించి నాలుగైదుమార్గాల్లో తాను సర్వేలు చేయించుకుంటున్నానని, ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నట్లు చెప్పారు. కచ్చితంగా గెలుస్తానని సర్వేల్లో, ఫీడ్ బ్యాక్ లో వచ్చిన వాళ్ళకి మాత్రమే టికెట్లిస్తానని మొహమాటంలేకుండా చెప్పారు. టికెట్లు రాకపోతే సీనియర్ల నొచ్చుకోవద్దని కూడా హెచ్చరించారు. పార్టీ అభ్యర్ధుల గెలుపుకోసం కష్టపడాలని, అధికారంలోకి రాగానే సీనియర్ల సేవలను అవసరమైన చోట్ల ఉపయోగించుకుంటానన్నారు. పరిశీలకులందరు నెలకు 8 రోజులు కచ్చితంగా నియోజకవర్గాల్లోనే పర్యటించాలని ఆదేశించారు. అలా పర్యటించినపుడే క్షేత్రస్ధాయిలోని సమస్యలు ఏమిటి ? పార్టీ ఏ విధంగా పనిచేస్తోందనే విషయం తెలుస్తుందన్నారు.

మొత్తంమీద ఇపుడు నేతలకైతే తన ఆలోచనలను స్పష్టంగానే వివరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపుపై స్పష్టమైన ఆఆలోచనతోనే ఉన్నారు. కాకపోతే రాబోయే ఎన్నికల్లో 40 శాతం టికెట్లు యువతకే ఇస్తామని హామీ ఇచ్చారు. మరి తన హామీని ఏ విధంగా అమలుచేస్తారనే విషయాన్ని చంద్రబాబు ఎలా నిలబెట్టుకుంటారో చూడాలి. ఎందుకంటే 40 శాతం టికెట్లంటే సుమారు 60 నియోజకవర్గాలను యువతకు కేటాయించాలి. మరి అన్ని టికెట్లను చంద్రబాబు యువతకు కేటాయించగలరా ? యువతంటే వారసులా ? లేకపోతే కొత్త యువతకు టికెట్లిస్తారా అన్నది తేలాలి.