Begin typing your search above and press return to search.

బ్రహ్మణికి ఆ విషయంలో దొరికిపోయిన నారా లోకేష్!

By:  Tupaki Desk   |   25 Feb 2023 8:07 PM GMT
బ్రహ్మణికి ఆ విషయంలో దొరికిపోయిన నారా లోకేష్!
X
టీడీపీ యువ నేత నారా లోకేష్ పాదయాత్రలో అందరికీ చేరువ అవుతున్నారు. ఊరువాడ తిరుగుతూ పలు వేదికల వద్ద ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ అందరి సమస్యలు వింటూ.. పరిష్కారానికి చొరవ చూపుతానంటూ ముందుకెళుతున్నారు. అయితే తాజాగా ఓ సభలో నారా లోకేష్ కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.

కరోనాకు ముందు లావుగా ఉండే నారా లోకేష్ ఇంత స్లిమ్ గా ఎలా మారాడు అన్నది కొందరు ఔత్సాహికులు అడిగారు. ఇలా స్లిమ్ కావడానికి ప్రేరేపించిన కారణాలు ఏంటని అడిగారు. దీనికి లోకేష్ నోటి వెంట వచ్చిన ఒకే ఒక్క ఆన్సర్ ‘బ్రాహ్మణి’.

నారా లోకేష్ ఎప్పుడూ పార్టీ, ప్రజలు అంటూ తిరుగుతూ బయట ఏది దొరికితే అది తినేసేవాడట.. ఈ క్రమంలోనే లావుగా తయారయ్యాడు. అయితే ఇలా బయట ఉండడంతో ఆయన భార్య బ్రహ్మణి.. నారా లోకేష్ తిండిని కంట్రోల్ చేయలేకపోయింది.

అయితే కరోనా లాక్ డౌన్ తో రెండేళ్ల పాటు అందరూ ఇంటికే పరిమితం కావడంతో లోకేష్ తన భార్య బ్రాహ్మణికి దొరికిపోయాడట.. రోజూ ఉదయాన్నే లేపి పరిగెత్తించి ఎక్సర్ సైజులు చేయించి ఫుడ్ డైట్ పాటించేలా చేసి అలా స్లిమ్ గా మార్చిందట.. ఇప్పటికీ ఏదైనా ఇష్టంగా తిందామంటే బ్రాహ్మణి తనను తిననీయదని.. అందుకే ఆ డైట్ మెయింటేన్ చేస్తూ ఇలా సన్నబడ్డానని లోకేష్ తెలిపాడు.

తాను ఇలా స్లిమ్ గా కావడానికి బ్రాహ్మణి కారణమంటూ ఓపెన్ అయ్యాడు మన లోకేష్ బాబు. భార్య భయంతోనే ఈ ఫిజిక్ మెయింటేన్ చేస్తున్నట్టు ఓపెన్ గానే బయటపెట్టాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.