Begin typing your search above and press return to search.
మోడీ లెటర్ కేసీఆర్ ను హర్ట్ చేసిందా?
By: Tupaki Desk | 21 Feb 2017 4:12 AM GMT![](https://scontent.fhyd1-1.fna.fbcdn.net/v/t1.0-0/p417x417/16649501_588736724664517_6509263852640490088_n.jpg?oh=198a93810cbdee441e38b2956dc32475&oe=59438923)
మొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 63వ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నతర్వాత ఆయన జరుపుకున్న మూడో పుట్టినరోజుగా చెప్పాలి. సీఎం అయ్యాక జరుపుకున్న రెండు బర్త్ డేలతో పోలిస్తే..ఈ పుట్టిన రోజు వేడుకలే ఘనంగా జరిగాయని చెప్పాలి. ప్రధాని మోడీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులాంటోళ్లు స్వయంగా ఫోన్ చేసి మరీ విషెష్ చెప్పటం.. తెలంగాణతో పాటు ఏపీలోనూ కేసీఆర్ పుట్టిన రోజును కొందరు జరపటం లాంటివి చోటు చేసుకున్నాయి. అంతేనా.. ప్రధాని మోడీ అయితే ఫోన్ చేయటం..ట్విట్టర్ లో విషెస్ చెప్పటమే కాదు.. కేసీఆర్ కి ఏకంగా ఒక ఉత్తరం రాశారు.
మోడీ రాసిన ఈ లెటర్ కు కాస్తంత విశేషం ఉంది. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన స్వయంగా లేఖను పంపారు. ఈ లేఖలో పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలుగులో రాసి ఉండటం. దీనికి కేసీఆర్ కచ్ఛితంగా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటారు. కానీ.. ఈ లేఖ కేసీఆర్ ను తప్పనిసరిగా హర్ట్ చేసి ఉండాలి. ‘‘డియర్ శ్రీ రావు’’ అని ఇంగ్లిషులో మొదలెట్టి.. మిగిలిన మ్యాటర్ అంతా తెలుగులోనే రాసేశారు.
ప్రధాని మోడీ లేఖ కేసీఆర్ ను ఎందుకు హర్ట్ చేసి ఉండాలంటే.. ఈ లేఖలో రాసిన కంటెంట్ తెలంగాణ యాసలో లేకపోవటం ఆయన్ను చిన్నబుచ్చే అవకాశం ఉంది. తెలుగు భాషను తెలంగాణ యాసలో ఉండాలని ఆయనెంత పట్టుదలగా ఉంటారో తెలిసిందే. తెలుగు అంటే.. ఆంధ్రోళ్ల తెలుగేకాదని.. తెలంగాణ యాసకు ప్రత్యేకత ఉండాలని మొదటి నుంచి వాదిస్తుంటారు.
మాటల్లో ఎలా అయితే యాస ఉంటుందో అదే తరహాలో రాతలోనూ ఉండాలని ఆయన భావిస్తుంటారు. ఇందుకు తగ్గట్లే.. పాఠ్యపుస్తకాల నుంచి.. ఆయన నిర్వహించే దినపత్రిక వరకూ తెలంగాణ యాసకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మరి ఇలాంటి ‘రావు’కు మోడీ పంపిన లేఖలోని కంటెంట్ చూసినప్పుడు తెలంగాణ సీఎం ఫీల్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువ. పుట్టినరోజు నాడు తన లేఖలో మోడీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఫీల్ అయ్యేలా చేసి ఉంటారనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/