Begin typing your search above and press return to search.

ఎన్నికల తీరును మోడీ మార్చేస్తారా?

By:  Tupaki Desk   |   31 March 2016 4:34 AM GMT
ఎన్నికల తీరును మోడీ మార్చేస్తారా?
X
ఆదర్శాలు చెప్పటం వేరు. వాటిని అమలు చేయటం వేరు. కొన్ని విషయాలకు సంబంధించి మాటలు చెప్పినంత ఈజీగా పనులు కావు. అలాంటి ఒక చిక్కుముడుల అంశాన్ని ప్రధాని మోడీ మీదేసుకున్నారా? ఎన్నికల సంఘం నుంచి పలువురు రాజకీయ ప్రముఖుల వరకూ ఆదర్శంగా ఉండే ఒక అంశాన్ని పలు సందర్భాల్లో ప్రస్తావించినప్పటికీ.. ఆచరణలో మాత్రం మనకెందుకులే అన్నట్లుగా వదిలేసిన ఒక అంశాన్ని మోడీ టేకప్ చేయటం గమనార్హం.

ఒకవేళ.. మోడీ అనుకున్నట్లు జరిగితే.. దేశ ఎన్నికల స్వరూపం మొత్తం మారిపోవటం ఖాయం. ఇంతకీ అంత పెద్ద అంశం ఏమిటంటే.. దేశ వ్యాప్తంగా స్థానిక సంస్థలకు చెందిన ఎన్నికల నుంచి.. పార్లమెంటు ఎన్నికల వరకూ ఒకేసారి నిర్వహించటం. దీని వల్ల ఎన్నికలు మొత్తం ఒక్కసారే జరుగుతాయి. దీంతో.. సంక్షేమ పథకాల అమలుతో పాటు.. ప్రభుత్వ పని తీరుకుకళ్లాలు పడకుండా ఉండటం ఖాయం.

ఈ విధానంపై ఎన్నికల కమిషన్ మొదలు.. పలువురు రాజకీయ ప్రముఖులు సైతం మొగ్గు చూపినప్పటికీ.. దీని అమలు చెప్పినంత తేలిక కాకపోవటంతో ఏ ప్రభుత్వం ముందుకు అడుగు వేయలేదు. అయితే.. ఈ విధానాన్ని అమలు చేస్తే ఎలా ఉంటుందన్నది ప్రధాని ఆలోచనగా చెబుతున్నారు. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం కూడా ముందడుగు వేయని ఈ అంశాన్ని అమలు సాధ్యంగా మార్చాలన్నది మోడీ ఆలోచనగా చెబుతున్నారు. అదే జరిగితే.. నిత్యం ఏవో ఒక ఎన్నికలు అన్న పంచాయితీ లేకుండా ఒకేసారి ఎన్నికలు.. ఆ తర్వాత ఐదేళ్లు ప్రభుత్వాలు తాము చేపట్టాలనుకున్న కార్యక్రమాల్ని నిరాటకంగా చేపట్టే వీలు ఉంటుంది. ఎంతో సంక్లిష్టతతో కూడిన వ్యవహారాన్ని మోడీ కానీ విజయవంతంగా పూర్తి చేస్తే మాత్రం చరిత్రలో మిగిలిపోవటం ఖాయం.