Begin typing your search above and press return to search.

అసలుసిసలు నెల్లూరు ఆవు.. అక్షరాల రూ.35కోట్లు

By:  Tupaki Desk   |   3 July 2023 9:50 AM GMT
అసలుసిసలు నెల్లూరు ఆవు.. అక్షరాల రూ.35కోట్లు
X
మేలు జాతి ఆవు అన్నంతనే గుర్తుకు వచ్చేది నెల్లూరు ఆవు. అసలుసిసలు ఆవునకు కేరాఫ్ అడ్రస్ గా దీన్ని చెబుతారు. దీని ధర లక్షల్లో ఉంటుందని అనుకుంటారు.కానీ.. అది తప్పన్న విషయమే కాదు.. ప్రపంచంలో అసలుసిసలు నెల్లూరు జాతి ఆవుకు ఉన్న డిమాండ్ ఎంతన్న విషయం తాజాగా వెలుగు చూసింది.

బ్రెజిల్ లో నిర్వహించిన తాజా వేలంలో నెల్లూరు జాతి (ఒరిజినల్) ఆవును వేలం చేస్తే కనివిని ఎరుగని ధర పలికింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా నిలిచిన నెల్లూరు జాతి ఆవు మూడో వంతు యాజమాన్య హక్కును ఏకంగా రూ.11.82 కోట్లకు అమ్మేశారు.

వియాటినా 19 ఎఫ్ 4 మారా ఇమ్ విస్ అనే నాలుగున్నర సంవత్సరాల వయసున్న నెల్లూరు జాతి ఆవును గత ఏడాది వేలం వేయగా సగం యాజమాన్య హక్కు రూ.6.5 కోట్ల పలికితేనే ఔరా అనుకున్నారు. ఇప్పుడు పలికిన ధరను చూస్తే.. నెల్లూరు జాతి ఆవు ధర ఏకంగా రూ.35 కోట్లు అన్న విషయం అర్థమవుతుంది. వేలం ప్రకారం చూస్తే.. ఈ ఆవు ధర రూ.35.30 కోట్లుగా చెప్పాలి. అత్యంత నాణ్యమైన జన్యు లక్షణాలున్న నెల్లూరు జాతి ఆవును బ్రెజిల్ కు చెందిన డెయిరీ వ్యాపారులు పోటీ పడి మరీ సొంతం చేసుకుంటూ ఉంటారు.

ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. నెల్లూరు జాతి ఆవు ఏంటి? బ్రెజిల్ ఏమిటి? అన్న క్వశ్చన్ మీకు రావొచ్చు. దీనికి సమాధానం ఏమంటే.. దశాబ్దాల నుంచి నెల్లూరు జాతి ఆవుల్ని ఆ దేశానికి తీసుకెళ్లి.. వాటి జన్యు లక్షణాల్ని మరింతగా డెవలప్ చేశారు.

అలా చేసిన ఆవును ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం బ్రెజిల్ లో ఉన్న మొత్తం ఆవుల్లో నెల్లూరు జాతి ఆవులు 80 శాతంగా చెబుతారు. అంకెల్లోకి వస్తే.. ఇప్పుడా దేశంలో 16.70 కోట్ల నెల్లూరు జాతి ఆవులు ఉన్నాయి.

మనం ఆవుల్ని దేవతగా పూజిస్తాం కానీ చాలా దేశాల్లో ఆవు మాంసాన్ని పెద్ద ఎత్తున వినియోగిస్తారు. నెల్లూరు జాతి ఆవుల మాంసంలో కొవ్వు తక్కువగా ఉండటం వల్ల చాలా దేశాలు ఆవు మాంసానికి భారీ డిమాండ్ ఉంటుంది. నెల్లూరు జాతికి చెందిన శ్రేష్టమైన ఎద్దుల వీర్యానికి భారీ డిమాండ్ ఉంది. అర మిల్లీ లీటర్ రూ.4 లక్షల చొప్పున అమ్ముడవుతుందని చెబుతారు.

నెల్లూరు జాతికి చెందిన ఆవులకు ఉండే అతి ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి.. అత్యధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకొని మరీ తెల్ల రంగులోనే ఉండటం.. ధళసరి చర్మంతో ఉండటం వల్ల రక్తం పీల్చే కీటకాలు వాటి దరి చేరవు. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటంతో ఇన్ఫెక్షన్లను సమర్థంగా తట్టుకునే లక్షనంతో పాటు.. నాసిరకం జాతుల గడ్డిని సైతం తిని ఆరాయించుకోగలుగుతాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈనటంతో పాటు.. సరైన నిర్వాహణ లేకున్నా.. దూడలు సలుువుగా పెరిగే లక్షణం ఈ జాతి ఆవులకు ఎక్కువ. అందుకే.. వీటికి అంత డిమాండ్ గా చెబుతారు.