Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ ను గెలిపించే దమ్ముందా ప్రశాంత్ కిశోర్?
By: Tupaki Desk | 18 Feb 2020 8:45 AM GMTదశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన జాతీయ పార్టీ ప్రస్తుతం దారుణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒక ప్రాంతీయ పార్టీ మాదిరి తయారైంది. పార్టీని నడిపించే నాయకత్వం లేక.. కార్యకర్తలు, నాయకుల్లో ఉత్తేజం నింపే నాయకుడు లేక ప్రస్తుతం ఆ పార్టీ ఎలాంటి ప్రభావం చూపడం లేదు. మొన్న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలే నిదర్శనం. కనీసం మూడో స్థానంలో కూడా పోటీ ఇవ్వలేకపోయింది. ఈ పరిస్థితి దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతున్నా అక్కడ గ్రూప్ రాజకీయాలు పెట్రేగి పార్టీ పరువుపోతుంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ ను గెలిపిస్తావా అని ప్రశాంత్ కిశోర్ ను పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఎందుకంటే ఏ ఎన్నిక జరిగినా గెలిచిన వారు తన వల్లే వారికి విజయం సాధ్యమైందని చెబుతూ కాలం వెళ్లదీస్తున్న ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు దమ్ముంటే.. సత్తా ఉంటే క్షీణ దశలో ఉన్న కాంగ్రెస్ ను బతికించి తిరిగి అధికారంలోకి వచ్చేలా చేయగలవా అని పలువురు సవాల్ విసురుతున్నారు. గతంలో నరేంద్రమోదీ గుజరాత్ లో అధికారంలోకి రావడానికి, ఆ తర్వాత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడానికి, అనంతరం ఉత్తరప్రదేశ్, బీహర్, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల్లో ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు తాను పని చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నాడు. ఆ పార్టీల గెలుపును ఈయన వాపుగా భావిస్తున్నాడు. మరీ అంత సత్తా ఉన్నోడివి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురాగలవా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
గుజరాత్, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ, పశ్చిమబెంగాల్ లో మమత, తమిళనాడులో స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ జగన్ గెలిచే అవకాశాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ఆ గెలిచే చోట్లకు వెళ్లి పని చేయగా వారు గెలిచడానికి ప్రకటించుకుంటున్నాడు. నీకలాంటి శక్తి సామర్థ్యాలు ప్రస్తుతం జవసత్వాలు అన్నీ కోల్పోయిన కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేలా చేయాలని సోషల్ మీడియాలో పలువురు చెబుతున్నారు.
2014లో కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చెందింది. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో నామరూపాల్లేకుండా పోయింది. ప్రస్తుతం ఏపీ, ఢిల్లీలో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ చెంతకు చేరి గెలిపించే బాధ్యత తీసుకో అని సలహా ఇస్తున్నారు. మరి లేకుంటే ఆ పార్టీలు అధికారంలోకి రావడానికి అన్ని సిద్ధం చేసి కొత్తిమీర ఒక్కటే వేసే తరుణం లో ఈయన వచ్చి వేసేసి మొత్తం తానే చేశానని చెప్పుకోవడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు.