Begin typing your search above and press return to search.

ఐఫోన్‌-13 ఫోన్‌ల‌పై నెటిజ‌న్ల ట్రోలింగ్‌..!

By:  Tupaki Desk   |   16 Sep 2021 7:32 AM GMT
ఐఫోన్‌-13 ఫోన్‌ల‌పై నెటిజ‌న్ల ట్రోలింగ్‌..!
X
డిజ‌ట‌ల్ మార్కెట్ యుగం అంతా కూడా ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆస‌క్తిఆ ఎదురుచూస్తున్న ఐఫోన్‌-13 సిరీస్ ఫోన్ విడుద‌లైంది. ఈ వేరియంట్ ఫోన్ ను ఆపిల్‌ మంగళవారం నాడు లాంచ్ చేయ‌డంతో ఉత్కంఠ‌కు తెర ప‌డింది. కాగా ఈ ఫోన్ లాంచ్‌ ఈవెంట్‌లో బాలీవుడ్‌ క్లాసిక్ సాంగ్ అయిన‌టువంటి దమ్‌ మారో దమ్ ను వేశారు. ఐఫోన్‌-13 సిరీస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ లాంటివి కూడా అందుబాటులోకి వ‌చ్చేశాయి. ఇక ఇప్పుడు ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ లాంటి నాలుగు డిఫ‌రెంట్ వేరియంట్‌లను ఆపిల్ కంపెన్ అందుబాటులోకి తెచ్చింది.

ఇక ఇప్పుడు రిలీజ్‌ చేసిన‌టువంటి ఐఫోన్‌-13 సిరీస్ స్మార్ట్ ఫోన్లను ఈ నెల సెప్టెంబర్ 17 నుంచి ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్‌పై ప్రీ ఆర్డర్ పెట్టుకోవ‌చ్చ‌ని ఆపిల్‌ పేర్కొంది. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ఐఫోన్‌-13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ల‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే ఇప్పుడు రిలీజ్ చేసిన‌టువంటి ఐఫోన్‌-13 సిరీస్‌ ఫోన్లపై అప్పుడే ట్రోలింగ్ మొద‌లైంది. దీనిపై నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్లు పెడుతున్నారు. ఇప్ప‌టికే వ‌చ్చిన‌టువంటి ఐఫోన్‌-12కు అలాగే ఇప్పుడు రిలీజ్ చేసిన‌టువంటి ఐఫోన్‌-13 సిరీస్ ఫోన్ల‌కు మధ్య పెద్ద తేడా ఏమీ లేద‌ని, ట్విటర్ వేదిక‌గా నెటిజన్లు మీమ్స్ పంచుకుంటున్నారు. నెటిజన్లే కాదండోయ్ ఈ ఫోన్ల‌పై ఫుడ్‌ డెలివరీ సంస్థ అయిన జోమాటో సంస్థ కూడా త‌న‌దైన స్టైల్‌లో ట్రోల్ చేసింది. ఐఫోన్‌-13 సిరీస్ ఫోన్ ల విషయంలో ఆపిల్ కంపెనీ కెమెరాలను సమాంతరంగా కాకుండా, డయాగోనల్‌గా ఫిక్స్ చేసిందంటూ జొమాటో కామెంట్ చేసింది.

ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ ఐఫోన్‌-13 సిరీస్‌పై మీమ్స్ పేలుతున్నాయి. కొత్త సిరీస్ ఫోన్ల‌కు ఒక్క చిప్ ను మాత్ర‌మే మార్చగా మిగతా హర్డ్‌వేర్స్‌కు ‘న్యూ’ ను ఆడ్ చేసి న్యూ ఎక్స్‌పీరియన్స్ పేరు మీద ఇలా లాంచ్ చేయ‌డమేంటంటూ ట్రోలింగ్ న‌డుస్తోంది. ఇక దీనిపై ఒక నెటిజన్ అయితే ఎవ‌రి దగ్గర అయినా పాత ఐఫోన్‌-12 సిరీస్ ఫోన్ ఉంటే ఐఫోన్‌-13 అవ‌స‌రం లేదంటూ పాత‌, కొత్త ఫోన్‌ను డిజైన్ చేసిన‌టువంటి ఫోటోషాప్‌ వీడియోను షేర్‌ చేశాడు. ఇక కొత్త‌గా వ‌చ్చిన‌టువంటి ఐఫోన్‌-13 పాత సిరీస్ ఫోన్‌ల‌కు కొత్త‌గా ఏమీ లేక‌పోయింది.

పైకి కొత్త‌గా లేకున్నా గానీ ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు లోపల చాలా స్పీడ్ ప్రాసెసింగ్ తో పాటు మెరుగైన బ్యాటరీ పీరియ‌డ్ అలాగే కొత్త కెమెరా లాంటి వాటితో పాటు వీడియో రికార్డింగ్ మోడ్ ల‌ను అందిస్తోంద‌ని ఆపిల్ కంపెనీ తెలిపింది. ఇక ఇండియాలో ఐఫోన్ 13 మినీ 128జీబీ ఫోన్ రూ.69,900ల‌కు అందుబాటులో ఉంది. అలాగే ఇదే వేరియంట్ లో 256జీబీ మోడల్ ఫోన్ రేటు రూ.79,900 ఉంది. ఇక 512జీబీ ఫోన్ అయితే రూ .99,900 లకు, అలాగే 128జీబీ ఫోన్ రూ .79,900 అందిస్తోంది ఆపిల్ కంపెనీ.