Begin typing your search above and press return to search.

ఆధార్ ఫింగర్ ప్రింట్స్ తో నయా మోసం..!

By:  Tupaki Desk   |   5 Feb 2023 5:00 AM GMT
ఆధార్ ఫింగర్ ప్రింట్స్ తో నయా మోసం..!
X
కాదేదీ కవితకు అనర్హం అన్నట్లుగా.. మోసాలకు అలవాటుపడిన కేటుగాళ్లు ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. బెజ్జం దూరే సందు ఇస్తే ఏనుగును దూర్చినట్లుగా సైబర్ కేటుగాళ్లు కేంద్ర ప్రభుత్వం హై సెక్యూరిటీతో జారీ చేసిన 'ఆధార్'ను సైతం వదిలిపెట్టడం లేదు. ఏకంగా ఆధార్ ఫింగర్ ఫ్రింట్స్ నకిలీవి సృష్టించి సైబర్ కేటుగాడు కోట్లు కొల్లగొడుతుండటం గమనార్హం.

ఈ నేరాలకు పాల్పడుతున్న ఓ ముఠాను కడప జిల్లాకు చెందిన పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో ఈ ముఠా గుట్టురట్టయింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్ కు చెందిన శేష నాథ శర్మ సైబర్ నేరాల్లో అరితేరాడు. శర్మ మరో ఇద్దరు వ్యక్తులతో ముఠాగా ఏర్పడి ఆధార్ ఫింగర్ ప్రింట్స్ డూప్లికేట్ చేయడం ప్రారంభించారు.

ఆధార్ వివరాలతో బ్యాంకు ఖాతాల్లోని నగదును ఎంచక్కా ఉన్నచోటు నుంచి కోట్లు కాజేస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు ఈ ముఠా సభ్యులు ఉంటున్న ప్రాంతానికి పోలీసులు చేరుకొని ఫింగర్ ప్రింట్ డూప్లికేట్ చేస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి హార్డ్ డిస్క్.. స్కానర్.. రెండు సెల్ ఫోన్లు.. ఫింగర్ ప్రింట్ డివైజ్.. ఒక మానిటర్ స్వాధీనం చేసుకున్నారు.

ఈ ముఠా సభ్యులు దేశవ్యాప్తంగా 440 మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరి బారిపడి నగదును పొగొట్టుకున్న బాధితులు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలని కడప ఎస్పీ అన్బురాజన్ కోరారు. ఆధార్ కార్డుల సమాచారం దుర్వినియోగం కాకుండా బయోమెట్రిక్ లాక్ లేదా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు.

పెరుగుతున్న టెక్నాలజీని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారని అన్నారు. ఇదే కోవలో ఆధార్ ఫింగర్ ఫింట్స్ ను సైతం డూప్లికేట్ చేస్తూ సులువుగా ఖాతాదారుల అకౌంట్లోని డబ్బులు మయం చేస్తున్నారని తెలిపారు. ప్రజలు ఆధార్ ప్రింట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని లేకుండా దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని ఎస్పీ హెచ్చరించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.