Begin typing your search above and press return to search.

ఈమె ఆట.. అందం రెండూ సూపరో సూపర్‌

By:  Tupaki Desk   |   6 March 2023 8:00 AM GMT
ఈమె ఆట.. అందం రెండూ సూపరో సూపర్‌
X
ఉమెన్స్‌ టీం ఇండియా క్రీడాకారిణి స్మృతి మందాన ఆటకు మరియు ఆమె అందానికి పడి చచ్చే క్రికెట్‌ అభిమానులు ఎంతో మంది ఉన్నారు. బాలీవుడ్‌ హీరోయిన్స్ కు ఏ స్థాయిలో పాపులారిటీ ఆ అమ్మడికి ఉంటుందో అదే స్థాయిలో స్మృతి మందాన కు ఉంటుంది అనడంలో సందేహం లేదు.

ఇండియన్‌ క్రికెట్‌ అభిమానులు ఇన్నాళ్లు స్మృతి మందాన అందం గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆమె రెండో స్థానానికి పడిపోయింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్న న్యూజీలాండ్ క్రికెటర్‌ అమిలియా కెర్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

నిన్న గుజరాత్ జట్టు పై ముంబై తరఫున ఆడిన అమిలియా 24 బంతుల్లో 45 రన్స్ చేసింది. హాఫ్ సెంచరీ తృటిలో మిస్ చేసుకున్న అమిలియా తన ఆటతో పాటు అందం తో కూడా అలరిస్తోంది. అందమైన ఈమె యొక్క సోషల్‌ మీడియా పేజ్‌ లకు ఒక్కసారిగా ఫాలోవర్స్ పెరిగారు.

45 కీలకమైన పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లు కూడా తీసిన అమిలియా కెర్ కు ఒక్కసారిగా ఇండియన్‌ క్రికెట్‌ అభిమానుల్లో ఫ్యాన్స్ భారీగా పెరిగారు. ఆట మరియు అందం రెండు కూడా సూపర్‌ అంటూ సోషల్ మీడియాలో అమిలియా గురించి తెగ కామెంట్స్‌ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.