Begin typing your search above and press return to search.

ప్రెగ్రెంట్ అయిన ప్ర‌ధాని..రంగంలోకి దిగిన డిప్యూటీ

By:  Tupaki Desk   |   19 Jan 2018 9:34 AM GMT
ప్రెగ్రెంట్ అయిన ప్ర‌ధాని..రంగంలోకి దిగిన డిప్యూటీ
X
న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్‌ డెర్న్ చెప్పిన తీపిక‌బురుతో ఆ దేశ ప్ర‌జ‌లు ఖుష్ అవుతున్నారు. తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఆమె ప్ర‌క‌టించ‌డం ఈ సంతోషానికి కార‌ణం. జూన్ నెలలో తాను ఓ బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ఆమె మీడియాకు తెలిపారు. అంతేకాదు, ఆరు నెలల మెటర్నిటీ లీవ్ కూడా ఆమె తీసుకోనున్నారు. ఆ సమయంలో డిప్యూటీ ప్రధాని ఆమె బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 37 ఏళ్ల జెసిండా.. 1856 తర్వాత న్యూజిలాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అతిపిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించారు. 1990లో పాకిస్థాన్ దివంగత ప్రధాని బెనజీర్ భుట్టో కూడా ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే కూతురుకి జన్మనిచ్చారు.

గత అక్టోబర్‌ లో సెంటర్ లెఫ్ట్ కూటమిని ఏర్పాటు చేసిన తర్వాత.. నవంబర్‌ లో ఆమె ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. గడిచిన ఏడాది సెప్టెంబర్‌ లో జరిగిన ఎన్నికల్లో జెసిండాకు చెందిన లేబర్ పార్టీ రెండవ స్థానంలో నిలిచింది. అయితే విన్‌స్టన్ పీటర్స్‌ కు చెందిన పార్టీతో జతకట్టి ఆమె కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోయే ఆరు రోజుల ముందే తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని గుర్తించినట్లు ఆమె చెప్పారు. ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఆమె తెలుపగానే.. సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్ష‌ల‌ ట్వీట్లు వెల్లువెత్తాయి.