Begin typing your search above and press return to search.

మళ్ళీ ఎంపీగా కిల్లి : పార్టీ మారితేనే లక్ ...?

By:  Tupaki Desk   |   15 July 2022 12:30 AM GMT
మళ్ళీ ఎంపీగా కిల్లి : పార్టీ మారితేనే లక్ ...?
X
ఆమె రాజకీయాలలో లక్ ని చూశారు. ఏకంగా జెయింట్ కిల్లర్ లాంటి దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడుని ఓడించేసి 2009 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఎంపీ అయ్యారు. అదే టెర్మ్ లో ఆమె మీద కాంగ్రెస్ హై కమాండ్ దయ చూపడంతో కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు సహాయ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆమె డాక్టర్ కిల్లి కృపారాణి. సిక్కోలు రాజకీయాల్లో ఆమె తనకంటూ ఒక ప్లేస్ ఉంచుకున్నారు.

ఆమె ఇపుడు వైసీపీలో తన రాజకీయాన్ని కొనసాగిస్తారు. అక్కడ ఆమె ఉన్నారూ అంటే ఉన్నారు కానీ ఏమీ ఎత్తిగిల్లలేదు అని మధన పడుతున్నారు. వైసీపీలో చేరి మూడేళ్ళు గడిచాయి. పార్టీ అధికారంలోకి వచ్చింది, అయినా తనకు మాత్రం ఏ రకమైన పదవీ దక్కలేదు అని ఆమె ఆవేదన చెందుతున్నారు. తాజాగా రాజ్యసభ సీటు దక్కుతుందని భావించినా లాస్ట్ మినిట్ లో మిస్ అయింది. దానికంటే కూడా జిల్లా పార్టీలో నాయకులు కూడా ఏ కోశానా పట్టించుకోవడంలేదు అంటున్నారు.

జిల్లాకు మంత్రిగా ధర్మాన ప్రసాదరావు అయ్యాక ఆమెకు ఉన్న వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ పదవీ పోయింది. ఆ ప్లేస్ లోకి మాజీ ఉప ముఖ్యమంత్రి క్రిష్ణ దాస్ వచ్చేశారు. అంతకు ముందు క్రిష్ణదాస్ డిప్యూటీ సీఎం గా ఉన్న వేళ కృపారాణి అధికార పార్టీలో కొంత జోరు చూపించేవారని చెబుతారు. దాసన్న కూడా ఆమెకు సహకరించారు అని అంటారు. ఇక రాక రాక సీఎం జగన్ ఫస్ట్ టైమ్ శ్రీకాకుళం జిల్లాకు వస్తే స్వాగతం పలికే నాయకుల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందారు. ఇది లోకల్ లీడర్స్ చేసిన పనే అని ఆమె భావిస్తున్నారు.

ఇక నాటి నుంచి ఆమె పార్టీ యాక్టివిటీస్ తగ్గించేశారు అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఆమె వైసీపీ నుంచి జంప్ చేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. 2019 ఎన్నికల ముందే ఆమెను టీడీపీలో చేరమని నాయకులు ఆహ్వానించారు. కానీ ఆమె వైసీపీని ఎంచుకున్నారు. ఇపుడు అక్కడ సరైన అవకాశాలు లేకపోవడంతో రెండో ఆలోచన చేస్తున్నారా అంటే జవాబు అవును అనే అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో బలమైన కాళింగ సమాజిక వర్గానికి చెందిన కృపారాణి కనుక టీడీపీలో చేరిత తమకు అదనంపు బలం అవుతుంది అని కూడా ఆ పార్టీ లెక్కలు వేస్తోంది.

ఇక జిల్లా టీడీపీలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికలలో సిట్టింగ్ ఎంపీ రామ్మోహననాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నరు. దాంతో ఆయన ప్లేస్ లో శ్రీకాకుళం ఎంపీ సీటు టీడీపీ తరఫున కృపారాణికి ఇస్తారని అంటున్నారు. అదే కనుక జరిగితే ఆమ లక్ తిరిగినట్లే అని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి రాజకీయంగా పట్టు ఉంది. ఎక్కువసార్లు ఎంపీ స్థానాన్ని ఆ పార్టీయే గెలుచుకుంది, జగన్ ఊపులో కూడా 2019 ఎన్నికల్లో ఈ సీటుని నిలబెట్టుకుని ఉత్తరాంధ్రాలోనే ఏకైక సీటుగా చూపించుకుంది.

అలాంటి సీటు నుంచి కనుక కృపారాణి పోటీ చేస్తే ఎంపీ కావడం తధ్యమని అంటున్నారు. ఆమె కూడా ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నారా అంటే జరుగుతున్న ప్రచారం మాత్రం అవును అనే వస్తోందిట. ఆమె కనుక పార్టీ మారితే వైసీపీఇ జిల్లాలో రాజకీయంగా కొంత ఇబ్బంది అవుతుంది అంటున్నారు. మొత్తానికి కృపారాణి దశ తిరగాలీ అంటే పార్టీ మారాల్సిందే అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.