Begin typing your search above and press return to search.
సస్పెండ్ అయినా హవా తగ్గని అనంత బాబు
By: Tupaki Desk | 26 May 2023 6:00 AMగోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే అనంతబాబుని గత ఏడాది హత్యా నేరం మీద పోలీసులు అరెస్ట్ చేశారు. చాన్నాళ్ళు ఆయన జైలు గోడల మధ్య ఉండి బెయిల్ మీద బయటకు వచ్చారు. జైలు గేటు నుంచి ఆయన ఊరి వరకూ భారీ ర్యాలీని అప్పట్లో తీసి ఒక సంచలనమే క్రియేట్ చేశారు అభిమానులు. అలా అనంతబాబు ఏపీ పాలిటిక్స్ లో ఫోకస్ అయ్య్యారు.
ఆయన మీద హత్యానేరం పడడం, తన సొంత డ్రైవర్ హత్య విషయంలో ఆయన పాత్ర ఉందని విపక్షాలు ఆరోపించడంతో వైసీపీ పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేసింది. అయితే అనంతబాబు కొంతకాలం మౌనంగా ఉండి ఆ తరువాత మళ్లీ వైసీపీ లో యాక్టివ్ అయ్యారని అంటున్నారు. ఇటీవల జరిగిన పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాలు పంచుకోవడం చర్చనీయాంశం అయింది అంటున్నారు.
పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఎమ్మెల్సీ ఎలా పార్టీ కార్యక్రమాలలో కనిపిస్తారు అని కూడా ప్రశ్నలు వెలువడుతున్నాయి. అనంతబాబు విషయంలో హై కమాండ్ మెత్తబడిందా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఇదిలా ఉండగా రంపచోడవరం ఎస్టీ రిజర్వ్డ్ సీటు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ధనలక్ష్మి ఉన్నారు. అయితే హవా అంతా ఎమ్మెల్సీ అనంతబాబుదే. ఆయన బలమైన సామాజికవర్గానికి చెందిన వారు కావడం, అంగబలం, అర్ధంబలం దండీగా ఉండడంతో ఆయన గెలుపు అవకాశాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారని అంటున్నారు
అలా రంపచోడవరంలో ఆయన రాజకీయ పట్టు కొనసాగుతోంది అని అంటున్నారు. ఎమ్మెల్యేగా ఎవరు ఉన్నా అనంతబాబుదే రాజ్యం అన్నట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. ఇక మరో పది నెలలలో ఎన్నికలు ఉన్నాయనగా అనంతబాబు మళ్లీ యాక్టివ్ కావడం అంటే కోరి ఆయన్ని ముందుకు తెస్తున్నారా అన్న చర్చ అయితే ఉంది.
అనంతబాబుకు వైసీపీ పెద్దల నుంచి ఆశీస్సులు ఉన్నాయని కూడా అంటున్నారు. ఏపీలో ఏడు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలలో రంప చోడవరం కీలకంగా ఉంది. ఇది గోదావరి జిల్లాల మధ్య ఉంది. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో పొత్తుల ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. దాంతో మళ్లీ ఎస్టీ సీట్లను మొత్తానికి మొత్తం తమ పరం చేసుకోవాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు.
ఈ నేపధ్యంలో అనంతబాబు పలుకుబడి ఆయన పట్టు హై కమాండ్ కి గుర్తుకు వచ్చాయని కూడా అనుమానిస్తున్నారు. లేకపోతే పార్టీ నుంచి బయటకు పంపేసిన వ్యక్తిని మళ్ళీ ఎలా ముందుకు తెస్తారు అన్న మాట అయితే గట్టిగా వినిపిస్తోంది. ఏది ఏమైనా అనంతబాబా మజాకా అని అంతా అంటున్నారు.