Begin typing your search above and press return to search.
కుప్పం టీడీపీ సారధిగా జగన్ కోటను కూల్చిన ఎమ్మెల్సీ
By: Tupaki Desk | 28 April 2023 7:00 AM GMTఆయన బహు మొనగాడే. నాలుగేళ్ళుగా ఎడారిలో ఎండమావులు తప్ప ఏమీ కనిపించని టీడీపీకి ఒయాసిస్సుగా మారి సక్సెస్ ఆక్సిజన్ అందించాడు. అది కూడా జగన్ కోటను కూల్చి మరీ వైసీపీకి అరవీర భయంకర విజేతగా మారాడు. ఆయనే కంచర్ల శ్రీకాంత్. మారి నెలలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయలసీమలో కంచర్ల శ్రీకాంత్ వైసీపీ క్యాడిడేట్ మీద అద్భుతమైన విజయం సాధించి సత్తా చాటాడు.
దాంతో ఆయన టీడీపీలో అత్యంత కీలక నేత అయిపోయారు పైగా వైసీపీ హార్డ్ కోర్ సబ్ రీజియన్ అయిన రాయలసీమ టీడీపీకి కొత్త ఆశగా ఆకర్షణగా మారిపోయారు. ఇక సరైన ఆయుధం ఉంటే ఎన్ని మ్యాజిక్కులు అయినా చేస్తారు. ఇపుడు అదే జరుగుతోంది.
నిన్నటి దాకా కుప్పం సహా వై నాట్ 175 సీట్లు అన్న వైసీపీ స్లొగన్ ఇపుడు సౌండ్ లేకుండా పోతున్న వేళ రాయలసీమలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లతో పాటు ఉత్తరాంధ్రాలో పట్టభద్రుల సీటుని గెలుచుకుని టీడీపీ గెలుపు మలుపు వద్ద నిటారుగా నిలబడి ఉంది.
ఈ జోరులో హుషారులో కుప్పంలో గత సారి వచ్చిన ముప్పయి వేల మెజారిటీ కాదు, 2019లో జగన్ కి పులివెందులలో వచ్చిన తొంబై వేల మెజారిటీని మించి లక్ష మెజారిటీని ఈసారి చంద్రబాబుకు దక్కే విధంగా చేయడానికి భారీ ప్లాన్స్ ని రెడీ చేస్తోంది
ఈ క్రమంలో కుప్పం టీడీపీ ఎన్నికల కమిటీ చైర్మన్ గా కంచర్ల శ్రీకాంత్ ని రంగంలోకి దింపడం పొలిటికల్ గా ఇంటరెస్ట్ ని పెంచేస్తోంది. శ్రీకాంత్ అసలే వ్యూహాలలో దిట్ట. లేకపోతే పార్టీ ఆశలు పెద్దగా పెట్టుకోని చోట అఖండ మెజారిటీని దక్కించుకుని వచ్చిన మేటి నేత ఎందుకు అవుతారు.
ఇపుడు ఆయన్నే ఆయుధంగా మార్చి వైసీపీ వై నాట్ కుప్పం అన్న స్లోగన్ మీదనే బాబు ప్రయోగించబోతున్నారు. రాయలసీమలో జగన్ సొంత ఇలాకా కడపలో సైతం గెలుపు సాధించిన శ్రీకాంత్ సరైన అస్త్రంగా బాబు భావించి ఆయనకు ఈ కీలకమైన బాధ్యతలు అప్పగించారు.
ఒక వైపు రాయలసీమలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లలో గెలుపుతో పాటు లోకేష్ పాదయాత్ర తెచ్చిన హుషార్ తో టీడీపీ హోరెత్తిపోతోంది. దానికి తోడు అన్నట్లుగా శ్రీకాంత్ దూకుడుతో ముందుకు సాగితే ఏపీ చరిత్రలో సరికొత్త అధ్యాయనానికి చంద్రబాబు శ్రీకారం చుడతారు అంటున్నారు.
కుప్పంలో లక్ష లోట్లు అంటే బాబు రికార్డు ఎప్పటికీ పదిలంగా ఉంటుంది అన్న మాట. అలా చేయాలన్న బిగ్ టార్గెట్ తోనే సరైన సమయంలో శ్రీకాంత్ ని రంగంలోకి దించెశారు. ఇక సీమలో ఎమ్మెల్సీ ఎన్నికల పరాజయ భారంతో చతికిలపడిన వైసీపీ ఈ నవ్య నూతన వ్యూహకర్త శ్రీకాంత్ తో ఎలా ఢీ కొడుతుందో చూడాలి. కుప్పం మాదే అన్న నిబ్బరం నుంచి ఇపుడు బాబు లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యాన్ని ఎలా తగ్గించాలన్న దాని మీద ఫోకస్ పెడుతుందా అన్న చర్చ కూడా వస్తోంది.