Begin typing your search above and press return to search.

మర్యాదస్తుడి మాస్కు తీసేసిన పరకాల!

By:  Tupaki Desk   |   8 April 2023 6:21 PM GMT
మర్యాదస్తుడి మాస్కు తీసేసిన పరకాల!
X
పరకాల ప్రభాకర్.. ఈ పేరు వింటే చాలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులకు కోపం నషాళానికి అంటుతుంది. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినపుడు అందులో చేరి, కొన్ని నెలలకే పార్టీ నుంచి బయటికి వచ్చి.. పీఆర్పీ ఆఫీస్‌లోనే కూర్చుని పార్టీ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించిన విషయాన్ని వాళ్లు అంత సులువుగా మరిచిపోలేరు. చిరు, పవన్ అభిమానులు కోవర్టుగా పేర్కొంటూ పరకాల మీద ఇప్పటికీ సోషల్ మీడియాలో విరుచుకుపడుతూనే ఉంటారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ పరకాలను తిట్టిపోయగా.. ఆయన కూడా తీవ్ర స్థాయిలోనే స్పందించారు.

‘‘ఆ రోజుల్లో నీ అమ్మని రోజూ మింగేవోడినని నీకున్న కోపం ఇప్పుడు ఇలా వాగి తీర్చుకుంటున్నావు. పాపం నీ బాధ అర్థం అయింది’’ అంటూ అభ్యంతరకర భాషలో ఆయన బదులిచ్చారు. సదరు నెటిజన్ వ్యాఖ్యలు అభ్యంతరకరమే అయినా.. పరకాల స్థాయి వ్యక్తి ఇలాంటి భాష వాడటం పట్ల అందరూ ఆశ్చర్యపోయారు. చాలామంది అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు.

కొందరేమో పరకాల అకౌంట్ హ్యాక్ అయి ఉండొచ్చని.. ఆయన ఇలాంటి భాష వాడరని అభిప్రాయపడ్డారు కూడా. కానీ తన అకౌంట్ హ్యాక్ అవ్వలేదంటూ మరోసారి మెగా అభిమానులకు ఆయన గట్టి కౌంటరే ఇచ్చారు. చాలామంది మిత్రులు తన అకౌంట్ హ్యాక్ అయిందా అని అడుగుతున్నారని.. అలాంటేదేమీ జరగలేదని.. ఆ ట్వీట్లు తనవే అంటూ ఆయన తీవ్ర పదజాలంతో కొత్త ట్వీట్ వేశారు. తాను మర్యాదస్తుడిలా ఉండాలనుకోవడం లేదని.. తనను బూతులు తిడితే అంతకంటే పెద్ద బూతులు వాడగలనని ఆయన తేల్చి చెప్పారు.

‘‘ఒక్క మాటకి గింగిరాలు తిరిగిపోతున్న నా కొడకల్లారా.. నాతో పెట్టుకుంటే మీకన్నా చెత్త భాష వాడి మిమ్మల్ని నానా తిట్లూ తిట్టగలను. ఖబడ్దార్! పోయి రెండింట్లో ఒకటి ఓడిన మీ దాక మొహం నాయకుడికో, రెండుకు రెండు ఓడిన మీ పిత్తపరిగి నాయకుడికో చెప్పుకోండి. అసలు గాళ్ళు అన్నీ మూసుకు కూర్చుంటే, ఇక్కడ కొసరు కుక్క గాళ్ళు వగరుస్తున్నారు. మొరిగే బదులు పోయి నాలుగు ఓట్లు అడుక్కోండెహే, ప్యాకేజీ పార్టీల నాయాళ్ళారా’’ అంటూ ఆయన వేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఇంతటితో ఆగకుండా తర్వాతి రోజు సాయంత్రం తన హేటర్స్‌కి ఇంకోసారి సమాధానం చెబుతానని కూడా ఆయన హింట్ ఇవ్వడం గమనార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.