Begin typing your search above and press return to search.

ముప్పేట దాడంటే ఇదేనా ?

By:  Tupaki Desk   |   18 March 2023 7:11 PM GMT
ముప్పేట దాడంటే ఇదేనా ?
X
ముప్పేట దాడనే పదాన్ని చాలామంది చాలాసార్లు ప్రయోగిస్తుంటారు, చాలామంది వింటూనే ఉంటారు. కానీ దాని అసలైన అర్ధం ఇపుడు కేసీయార్ కుటుంబాన్ని చూస్తే తెలుస్తుంది. కేసీయార్, కవిత, కేటీయార్ ముగ్గరిమీద ఒకేసారి వివిధ రూపాల్లో దాడులు జరుగుతున్నాయి. బహుశా దీన్నే ముప్పేటదాడంటారేమో. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కవిత వెంటపడింది. టీఎస్పీఎస్సీ నిర్వహించిన ప్రవేశపరీక్షల ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం తాజాగా కేసీయార్, కేటీయార్ కు చుట్టుకుంటోంది.

టీఎస్పీఎస్సీ నిర్వహించిన ప్రవేవపరీక్షల ప్రశ్నపత్రం లీకవ్వటంతో చాలా పరీక్షలను ప్రభుత్వం రద్దుచేసింది. ప్రవేశపరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తొందరలోనే ప్రకటిస్తానని బోర్డు చెప్పింది. దాంతో గ్రూప్ 1 పరీక్ష రాసిన వేలాదిమందిలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇపుడా విషయం కేసీయార్ కు చుట్టుకోబోతోంది. నిరుద్యోగులు, పరీక్షలు రాసినవారంతా టీఎస్పీఎస్సీ ఆపీసు ముందు గోల మొదలుపెట్టారు. యువకుడి ఆత్మహత్యకు కేసీయార్ నిర్లక్ష్యమే కారణమని ప్రతిపక్షాలు ఆరోపణలు మొదలుపెట్టాయి.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డయితే యువకుడి ఆత్మహత్యకు కారకుడంటు కేసీయార్ మీద హత్యా నేరం కింద కేసు నమోదుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ఫెయిలైనందుకు నైతిక బాధ్యతగా మంత్రి కేటీయార్ రాజీనామా చేయాలనే డిమాండ్ ప్రతిపక్షాల నుండి పెరిగిపోతోంది. ఎందుకంటే ఒక వ్యక్తిచేసిన పనిని ప్రభుత్వానికి ఎలా ఆపాదిస్తారంటు కేటీయార్ మండిపడ్డారు. దానిమీదే ఇపుడు నిరుద్యోగులు, పరీక్షలు రాసిన వాళ్ళతో కలిసి ప్రతిపక్షాలు గోల మొదలుపెట్టాయి.

అంటే ఏకకాలంలో ఒకవైపు కూతురును ఈడీ వెంటాడుతోంది. ప్రవేశపరీక్షల లీకేజీ వ్యవహారం కేసీయార్, కేటీయార్ కు గట్టిగా తగులుకుంటోంది. ఒకేసారి తండ్రి, కొడుకు, కూతురు ఇబ్బందుల్లో తగులుకోవటాన్ని ముప్పేటదాడి అని అంటారు. ప్రవేశపరీక్షల ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం రాష్ట్రానికి సంబంధించే కాబట్టి ఏదోలా కేసీయార్, కేటీయార్ బయటపడతారు. కానీ ఈడీ విచారణ నుండి కవిత ఎలా బయటపడగలరు ? అనేది ఆసక్తిగా మారిపోయింది. మొత్తానికి ఒకేసారి యావత్ కుటుంబానికి ఏదోరూపంలో సెగ బాగా తగులుతోందనే చెప్పాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.